జగన్ పై రాయి దాడిని ప్రత్యర్ధులు సైతం ఖండించారు, మెలిక అర్ధంచేసుకున్న వారు ట్రోల్ కూడా చేశారు. కానీ స్వయానా జగన్ చెల్లి ఐన షర్మిల మటుకు నిశ్శబ్దంగానే ఉంది. ఎదో ఫార్మాలిటీ ని, అది కూడా “ప్రమాదవశాత్తు జరిగిందని అనుకుంటున్నాం” అంటూ ఒక ట్వీట్ చేసి, తర్వాత తన రాజకీయ ప్రసంగాల్లో ఎక్కడ ఆ ఊసే లేకుండా, జగన్ ప్రభుత్వ విధానాలపైనే మాట్లాడుతుండం, జగన్ ని విమర్శించడం విశేషం.
ఎన్నికల ముందు ఇలాంటి ఎత్తుజిత్తులు జగన్ చేస్తుంటాడని పవన్, లోకేష్ లాంటోళ్లే పసిగడుతున్నప్పుడు, సొంత చెల్లి ఐన షర్మిలకు ఆ మాత్రం క్లారిటీ ఉండదా చెప్పండి, అందుకే ఈ సంఘటనలో అన్న కి అనవసర మైలెజ్ ఇచ్చే ఉద్దేశం లేకనే షర్మిల సైలెంట్ అవడం గమనార్హం. ఏదేమైనా ఈసారి జగన్ ఎన్ని రకాలుగా తన రెగ్యులర్ ఫార్ములాలు అమలుచేసినా, అవేవి వర్కౌట్ అయ్యేలా అస్సలు కనబడడం లేదు.