వివేకా కేసు గురించి మాట్లాడకూడదు అంటూ కడప కోర్ట్ నుండి అవినాష్ రెడ్డి నోటీసు తీసుకొచ్చిన దగ్గరినుండి సునీత మూగబోయింది. కానీ షర్మిల మటుకు ససేమిరా అంటూ మరోసారి అన్న జగన్ ను ఈ కేసు ని ఉద్దేశిస్తూ విమర్శిస్తూనే ఉంది.
ఎన్నికల క్యాంపెయిన్లలో భాగంగా షర్మిల మాట్లాడుతూ అవినాష్ రెడ్డే అసలు నిందితుడు అని సిబిఐ తేల్చి అరెస్ట్ చేయడానికి వస్తే జగన్ రాష్ట్రంలో ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించి, పోలీసులతో, రౌడీలతో అధికారులను భయబ్రాంతులకు గురిచేశాడు అంటూ షర్మిల వాపోయింది. సునీత వెల్లడించిన వివరాలను బట్టి, సిబిఐ దర్యాప్తును బట్టి ఎటు తిరిగినా వేళ్ళన్నీ నిందితుడు అవినాష్ రెడ్డే అని స్పష్టంగా చూపిస్తుంది.
Also read: కంపెనీలు తేలేను, పక్క రాష్ట్రం వెళ్లి ఉద్యోగాలు చేసుకోండి- జగన్
కేవలం జగన్ తన అధికారాన్ని తమ్ముడిని రక్షించుకోవడానికి మాత్రమే వినియోగిస్తునట్లుగా తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం మారి జగన్ గద్దె దిగితే మటుకు అక్రమాస్తుల కేసుల్లో అటు అన్నకి, హత్య కేసులో ఇటు తమ్ముడికి ఇద్దరికీ జైలే గతి ఆనేలాగే పరిస్థితి ఉంది. చంద్రబాబు ని ఇటీవల జైల్లో వేసిన జగన్ ని అంత తేలిగ్గా టీడీపీ ప్రభుత్వం వదిలే ప్రసక్తే లేదు.