వైఎస్సార్ పైన ఛార్జ్ చీట్ ధాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ లో షర్మిల చేరడమేంటి అని మొన్నటివరకు వైసీపీ నాయకులు గగ్గోలు పెట్టారు. అయితే ఈ విషయం ఇప్పుడు ఏకంగా ఆటం బాంబ్ పేల్చింది.
ఛార్జ్ షీట్ లో వైఎస్సార్ పేరు ఉంటేనే తాను సేఫ్ అవుతాడని, దగ్గరుండి మరీ రాజశేఖర్ రెడ్డి పేరు ఛార్జ్ షీట్ లో ఎక్కేలా చేసింది సాక్ష్యాత్తు జగన్. తన లాయర్ సుధాకర్ రెడ్డి సాయంతో ఈ పనికి ఒడిగట్టాడు అంటూ షర్మిల పేర్కొంది.
అయితే కాంగ్రెస్ లో చేరిన నాటినుండి వైసీపీ నాయకులు ఈ కామెంట్లు చేస్తున్నా
కూడా అప్పుడు సైలెంట్ గా ఉన్న షర్మిల ఇప్పుడెందుకు వాటిని ఖండిస్తోంది. షర్మిల వ్యాఖ్యల్లో నిజానిజాలు ఎంత. చూద్దాం.