హరిరామ జోగయ్య దొంగ దెబ్బ కి, పవన్ చావు దెబ్బ

harirama-jogaiah-pawan-kalyan-tg2ap

డివైడ్ అండ్ రూల్ పాలసీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎప్పటికీ ఎవర్ గ్రీన్. సరిగ్గా ప్రయోగిస్తే మటుకు ఫలితాలు పక్కాగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ ని ఓడగొట్టాలని పిఠాపురం మాస్ లీడర్ వర్మ ని మొదటినుండి ఎదో విధంగా రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నారు వైసీపీ మూక. అగ్గి రాజేస్తే ఇద్దరికీ చెడుతుంది, అప్పుడు పవన్ ని టార్గెట్ చేయడం సులువవుతుందని అధికార పార్టీ ఎన్నో సార్లు ప్రయత్నించింది. ఈ ఎత్తు తెలుసుకుని, పవన్-వర్మ నానాటికి అంతకంతకు దగ్గరవుతున్నారు. పవన్ ని గెలిపించడమే ఛాలెంజ్ గా తీసుకొని వర్మ ఎప్పటికప్పుడు ప్రచార జోరు పెంచారు. ఇక ఇదే రకమైన విడగొట్టే పాలసీ ని ఎప్పటినుండో రకరకాలుగా ప్రయోగించాలని చూసిన హరిరామ జోగయ్య తాజాగా పవన్ కి మరో లేఖ రాశారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పవన్ కి కీలకమైన హోమ్ మినిస్ట్రీ తో పాటు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టాలని జోగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు చంద్రబాబు పై పవన్ ఒత్తిడి తీసుకొని, ఎన్నికలకు ముందే ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు.

Also read: Pawan Kalyan in no mood to take a chance

కానీ పవన్ ఇండిపెండెంట్ క్యాన్డిడేట్ అయితే ఈ ఆలోచన చేయొచ్చేమో కానీ, ఆయన ఒక పార్టీ ప్రెసిడెంట్. పార్టీ ని నడపాలంటే నిధులు కావాల్సిందే, దానికి పవన్ కి ఉన్న ఏకైక మార్గం సినిమాలు. మంత్రి పదవి, ఉప ముఖ్యమంత్రి పదవి రెండు ఉంటే, పవన్ ఇక సినిమాలకు స్వస్తి చెప్పక తప్పదు. కాబట్టి పిఠాపురం ఎమ్మెల్యే పదవి తో మాత్రమే పవన్ సరిపెట్టుకునే అవకాశం ఉంది. పైపెచ్చు కీలకమైన హోమ్ మినిస్ట్రీని అనుభవం లేని పవన్, చంద్రబాబు ని డిమాండ్ చేస్తే మొత్తానికే మోసం వస్తుంది. ఇద్దరి మధ్య అగ్గి రేగే అవకాశాలు ఉన్నాయి. ఈ లాజిక్ తోనే జోగయ్య ఈ పాచిక వేసినా కూడా, ఆ పాచికలకు పడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా కాదనే చెప్పుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *