ఏకులా వచ్చి మేకులా తయారవడం అనే సామెతని తిరగతోడుతూ, మేకులా వెళ్లి, మేకులాగే వైసీపీ ని తగులుకున్నాడు రఘు రామ కృష్ణం రాజు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా కృష్ణం రాజు అనే పేరు రెబెల్ కి సంకేతం అని ఈయన్ని చూస్తుంటేనే తెలుస్తుంది. గత నాలుగున్నర సంవత్సరాల నుండి పార్టీ లో ఉంటూనే, ఎంపీ హోదాలో జగన్ ని ఈయన ఆడుకున్నంత బహుశా ఇంకెవరు ఆడుకోనుండరు. ఎంపీ గా ఆయన టర్మ్ ముగిశాక, నర్సాపురం నుండే తిరిగి టికెట్ పొందాలని బీజేపీ లో చాలా ప్రయత్నాలే చేశారు. కానీ అవేవి కుదరకపోవడం వల్ల మధ్యలో కూటమిపై అసహనం వ్యక్తం చేశారు.
జగన్ కి ఆజన్మ శత్రువైన రఘురామ లాంటోడ్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదని, ఎలాట్ చేసిన కాండిడేట్ ని తప్పిస్తూ మరీ, ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామ ని ఎన్నుకున్నారు చంద్రబాబు. ఎంపీ టికెట్ రాకుండా బీజేపీ వర్గాలను కూడా మేనేజ్ చేసిన వైసీపీ, చంద్రబాబు ని మటుకు ఆపలేకపోయాయి. ఎంపీ గా అయితేనేం, ఎమ్మెల్యే గా అయితేనేం, రఘురామ దూకుడు ఇక టీడీపీ నుండి చూడ్డానికి వైసీపీ సిద్ధంగా ఉండాల్సిందే.