క్రైమ్ లో కామెడీ ఉండాలి, క్రైమే కామెడీ అవకూడదు. పారిజాత పర్వం చేసిన తప్పు అదే. క్రైమ్ కామెడీ జానర్ లో గతం లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయినా సందర్భాలెన్నో. దానికి మెయిన్ రీసన్ వాటిలో అన్నీ క్రైమ్ చేస్తున్న దశలో సందర్భానుచితంగా కామెడీ జెనెరేట్ అవడం.
కానీ పారిజాత పర్వంలో కామెడీ కోసం కొన్ని సీన్లు కావాలని ఇరికించినట్టుగా, ఓవర్ యాక్షన్ చేస్తూ ఆర్టిస్టులు కూడా నవ్వించడానికి ప్రయత్నాలు చేయడం వంటివి తెర మీద చాలా క్లియర్ గా తెలుస్తుంటాయి. దానికి తోడు క్రైమ్ కోసం ఎంచుకున్న లైన్ కూడా సినిమాలో నవ్వులాట లాగే అనిపిస్తుంది తప్పితే, సీరియస్ వాతావరణం లాగ అసలుండదు. దాని వల్ల సినిమాలో అటు క్రైమ్, ఇటు కామెడి రెండు లేక ఎటు కాకుండా పోయింది.