వివేకా మర్డర్ కేసు ఒక్కటే వైసీపీ ని, ముఖ్యంగా అవినాష్ రెడ్డి ని ఎన్నికల వేళ ముందుకి కదలనీయకుండా చేశాయి. కాబట్టి కడప కోర్టులో ఎలాగో ప్రయత్నించి విచారణలో ఉన్న కేసు గురించి ప్రస్తావించొద్దు అని ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు, దానితో సునీతమ్మ సైలెంట్ అయిపోక తప్పలేదు. అయితే ఇప్పుడు స్వయంగా అవినాశే ఈ కేసు గురించి తన అఫిడవిట్ లో పేర్కొనడం గమనార్హం.
వివేకా హత్య కేసు లో తనని సిబిఐ A8 నిందితుడిగా పేర్కొన్నట్టుగా అవినాష్ వెల్లడించారు. ప్రస్తుతానికి సునీతమ్మ సైలెంట్ అయినా కూడా, ఒక్కసారి ప్రభుత్వం మారితే మటుకు, సిబిఎన్ ని జైలు కి పంపిన వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి సరైన అవకాశం కోసం చూస్తున్న టీడీపీకి, అవినాష్ సాలిడ్ గా బుక్ అవక తప్పదు. మరొక సైడ్, ప్రభుత్వం మారకున్నా కూడా, సునీతమ్మ ఎన్నికల తర్వాత విజృంభించడం ఖాయం. కాబట్టి ఎటు చూసినా ఎన్నికల తర్వాత అవినాష్ కి దేశ్ తడి పోచమ్మ గుడి తప్పేలా లేదు.