అంతంత వయసొచ్చి కుర్రాళ్ళ లాగా ఆ చిందులేంది, వయసుకు తగ్గట్టు పాత్రలు చేయొచ్చుగా అని కొంతమంది హీరోలను చూస్తే అనిపిస్తది. ఆ హీరోల్లో ఖచ్చితంగా రజిని మటుకు ఉండరు. రజిని అంటేనే స్టైల్. ఆయన నుండి ఎప్పటికైనా అభిమానులు కావాలనుకునేది ఆ “భాష” తరహా వింటేజ్ సూపర్ స్టారే.
అందుకే ఇప్పుడు అలాంటి పక్క కమర్షియల్ టెంప్లేట్ లోనే, అది కూడా లోకేష్ కనగరాజ్ లాంటి లేటెస్ట్ సెన్సేషన్, మరియు ఎప్పటిలాగే అనిరుద్ మ్యూజిక్ కలయిక లో కూలి అనే సినిమా ముస్తాబవుతోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. పెట్ట సినిమాలో రజిని ఎలాగైతే వింటేజ్ సూపర్ స్టార్ లా అలరించాడో, అంతకు మరింతగా యంగ్ లుక్ మేక్ ఓవర్ తో ఈ కూలీ లో ఆకట్టుకుంటున్నాడు రజిని. లుక్ అదిరింది, కాంబినేషన్ అదిరింది, మరి బాక్స్ ఆఫీస్ అదరకుండా ఎలా ఉంటది చెప్పండి.