మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తో అప్పట్లో బాలీవుడ్ ప్రముఖులు ఎందరితోనో సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. అందులో ట్వింకిల్ ఖన్నా పేరు కూడా ఉండడం విశేషం. దావూద్ నిర్వహించిన ఒక పార్టీ లో ట్వింకిల్ డాన్స్ ఏసిందంటూ అప్పట్లో మీడియా కోడై కూసింది. ఈ వార్తల్ని ఇటీవల ట్వింకిల్ ఖండిస్తూ నేను గొప్ప డాన్సర్ ని కాదు, దావూద్ తలుచుకుంటే నాకంటే గొప్ప డాన్సర్లని పెట్టుకోవచ్చు. అయినా నేను డాన్స్ ఏస్తే ఎలా ఉంటుందో నా కుటుంబ సభ్యులకు తెల్సు. అందుకే వాళ్లెవరు ఈ వార్తల్ని నమ్మలేదు అంటూ చెప్పుకొచ్చింది.
సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, రిషి కపూర్, మోనికా బేడీ లాంటి ఎందరో బాలీవుడ్ ప్రముఖులతో దావూద్ కి సత్సంబంధాలు ఉన్నాయి. అదే కోవలో ట్వింకిల్ ఖన్నా కూడా ఉండొచ్చు. తాను ఇది ఖండించినా కూడా నిప్పులేనిదే పొగ రాదుగా మాష్టారు.