గ్లామర్ హీరోయిన్ గా ట్యాగ్ పడక ముందే అనుష్క, నయనతార లాంటి స్టార్లు ఫిమేల్ సెంట్రిక్ మాస్ సినిమాలు చేశారు. అలాంటి మాస్ సబ్జెక్టులు కాకున్నా ఓన్లీ గ్లామర్ ని నమ్ముకుంటూ మంత్ర లాంటి హారర్ థ్రిల్లర్ సినిమా తో కూడా ఛార్మి ఫిమేల్ సెంట్రిక్ గా హిట్ కొట్టింది. ఇక కాజల్ విషయానికొస్తే టాలీవుడ్ లో ఆమెతో నటించని స్టార్ హీరో లేడు. గ్లామర్ ఫుల్లుగా ఒలకబోసి టాప్ గ్లామరస్ హీరోయిన్ అనిపించుకుంది.
కానీ కాల క్రమేణా కొత్త హీరోయిన్లు వస్తున్నప్పుడు పాతవాళ్ళు కనుమరుగైపోవడం సాధారణం కాబట్టి, కాజల్ కూడా అలాగే కనుమరుగైపోయింది. పెళ్లి చేసుకొని బిడ్డ ని కూడా కనేసి, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమా తో ముందుకొస్తుంది కాజల్. గ్లామర్ హీరోయిన్ గా ఫుల్ గా పాపులర్ అయినా కాజల్, ఇప్పుడు సత్యభామ అంటూ ఒక ఫిమేల్ సెంట్రిక్ మాస్ సినిమా చేస్తే ఆడియన్స్ ఎంత వరకు ఆదరిస్తారు అనేది సందేహమే.