తెలుగు అమ్మాయిలకి అవకాశం ఇవ్వండి, హీరోయిన్లుగా తీసుకోండి అని ఒక పక్కన వాయిస్తుంటారు. అంతెందుకు ఆ వాయించేవాళ్లలో తెలుగు హీరోయిన్ ఐన చాందిని చౌదరి కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆవిడే కాంట్రవర్సీ కి కేంద్ర బిందువు అయ్యింది. ఇటీవలి విలేఖరి సమావేశంలో ఐపీల్ సీజన్లో లో మీ ఫేవరెట్ టీం ఏది అని అడగ్గా, నేను ఆంధ్ర కదా, ఆంధ్ర టీం లేదు అంటూ చెప్పుకొచ్చింది.
ఫేవరెట్ టీం లేదని చెప్పడమో, లేదా హైదరాబాద్ టీమ్ ఫేవరెట్ అని చెప్పడమో మానేసి ఇలా అనవసర కాంట్రవర్సీ క్రియేట్ చేయడంతో నెటిజన్లు ఇప్పుడు చాందిని ని దుమ్మెత్తిపోస్తున్నారు. “మాది ఆంధ్ర, మాది ఆంధ్ర” అని అన్నప్పుడు సినిమాలు కూడా అక్కడే చేసుకోవాల్సింది, తెలంగాణ కి రావడమెందుకు, ఇక్కడ బతకడమెందుకు అని ఇప్పుడు సోషల్ మీడియా లో అమ్మడిని అదే పనిగా ఆడుకుంటూనే ఉన్నారు.
నిజానికి తెలంగాణ ని ఇతర రాష్ట్రాలతో పోల్చి తక్కువ చేస్తే ఒకరకంగా ఉంటుంది, అదే తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర తో పోలిస్తే సెగ అంటుకుంటుంది. అందుకే చాందిని ఇప్పుడు చిక్కుల్లో పడ్డట్టే. ఇక అసలే ఆఫర్లు లేక విలవిలలాడుతున్న ఈ తెలుగు సుందరి, ఈ చిక్కుల్లోంచి బయటపడి కెరీర్లో ఎలా ముందుకెళ్తుందో చూడాలి.