24 నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అని పెద్దలు అంటారు. ఆ మాటని మరీ లిటరల్ గా తీసుకున్నట్టున్నారు మన రాజకీయనాయకులు, అదే పనిగా రాళ్లు మీదేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ పై రాయి పడి, హత్య జరిగిందేమో అనే రేంజ్ హడావిడి చేసేసిన 24 గంటల్లోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై, జనసేనాని పవన్ కళ్యాణ్ పై చెరొక రాయి పడింది.
సానుభూతి మాట అటుంచితే, ఈ రాళ్ళ యాపారం సామాన్య జనానికి మటుకు భలే వినోదం పంచుతుంది. మరి ఈ రాళ్ళ యాపారానికి సరైన గిట్టుబాటు ధర ఎవరికీ లభించి, ఈ ఎన్నికల్లో అధికారం దక్కుతుందో అనేది వేచి చూడాలి.