ఎన్నికల ప్రచార సమయం అనేది ఏ రాజకీయ పార్టీకైనా అత్యంత విలువైనది. మరో ఐదేళ్లు వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించేది. అంత విలువైన సమయం నాయకులు అత్యంత జాగ్రత్తగా ఏ మాత్రం వృధా చేయకుండా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల్లోకి వాళ్ళ పార్టీని బలోపేతం చేయడానికి, రానున్న ఐదేళ్లలో ఇవ్వాల్సిన భరోసాల గురించి చర్చిస్తూ, వారి నమ్మకాన్ని గెలుచుకోవాల్సి ఉంటుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని, టీడీపీ అధినేత చంద్రబాబు గాని అదే పనిలో నిమగ్నమై ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశాలే ఉన్నట్టు పొలిటికల్ వేవ్ కనబడుతుంది.
ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా జగన్ మటుకు ఇంకా రాయి ని పట్టుకొని వేలాడుతున్నాడు. తన మీడియా చేత అదే పనిగా హత్య యత్నం, వారు చేయించారు, వీరు చేయించారు, క్యాటర్ బాల్, ఎయిర్ గన్ లాంటి పరికరం అంటూ చాచిన చీమను ఏనుగుతో లాగే ప్రయత్నాలు చేస్తే, అతి ముఖ్యమైన ఎన్నికల సమయం వృధా అవడమే కాకుండా, ప్రజల్లో జోకర్ గా మిగిలిపోయేలా ఉన్నాడు జగన్. లాగింది చాలు, తెగుద్ది.