వైసీపీ రోజురోజుకి ఊబిలోకి పడిపోతున్నట్లు కనబడుతోంది. వివేకా కేసు గురించి మాట్లాడకూడదు అంటూ కోర్ట్ ఆర్డర్ తెచ్చుకొని బయటపడ్డారు అని అనుకుంటే ఇప్పుడు ముప్పులు వివిధ ఇతర రకాలుగా వచ్చి పడుతున్నాయి. కాపుల ప్రతినిధి ముద్రగడ వైసీపీ లో చేరి పవన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే అది పవన్ కి దెబ్బె అవుతుందనుకున్నారు. కానీ ఈ లోపే ఆయన తండ్రికి వ్యతిరేకంగా పవన్ కి అండగా నిలుస్తుంది.
Also read: ముద్రగడ కూతురు పవన్ వైపు
ఇదే కోవలో ఇప్పుడు అంబటి రాంబాబు అల్లుడు కూడా ముందుకొచ్చాడు. రాజకీయ నాయకుడు అంటే ప్రజా సంక్షేమం కొరకు పాటుపడేవాడు అయ్యుండాలి. ప్రతి నాయకుడిలో పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత ఈ లక్షణం ఉంటుంది. కానీ అంబటి లో అది ఏ రకంగా చూసినా కూడా దొరికే అవకాశమే లేదంటూ వాపోయాడు. ప్రత్యర్థి పార్టీలు ఈ కామెంట్లు చేసుంటే రాజకీయాల్లో మామూలే కదా అని కోట్టి పారేయొచ్చు. కానీ కుటుంబ సభ్యులే ముందుకొచ్చి ఖండిస్తుంటే జనాలు కూడా ఈ కామెంట్లను సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అటు ముద్రగడ తో పాటు, ఇటు అంబటి కి కూడా రాజకీయంగా ఇది చాలా పెద్ద దెబ్బనే చెప్పాలి.
Click to watch Ambati alludu video