ముద్రగడ నేరుగా వచ్చి పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారం చేసినా, లేదా జనసేన లో చేరినా కూడా పార్టీకి గాని, పవన్ కి గాని ఇంత మేలు జరగదేమో. పవన్ కి ఇప్పుడు అంతకంటే కొన్ని వందల రేట్లు ఎక్కువ మేలు చేస్తున్నారు ముద్రగడ.
ముద్రగడ కూతురు, అల్లుడు నిన్న నేరుగా పవన్ ని కలిసి పార్టీలో చేరడానికి కోరినట్లుగా తెలిసిందే. నిజానికి పవన్ అప్పటికప్పుడు వారిని పార్టీలో చేర్చుకొని రాజకీయంగా ఎంతో లబ్ది పొందడానికి ఫుల్ గా ఆస్కారం ఉంది. జనసేన నుండి వైసీపీ కి వెళ్లిన వాళ్ళను జగన్ అలాగే చేర్చుకొని పవన్ పై దుమ్మెత్తిపోయించాడు. కానీ పవన్ ఆ పని చేయకుండా ముద్రగడకి గౌరవమిచ్చి వారి కూతురుని పార్టీలో చేర్చుకోకుండా వారితో కలిసి వెళ్లి ముద్రగడని కలుస్తానని, కుటుంబ కలహాలు తీర్చి, కలిసి పనిచేసే దిశగా ముందుకెళ్తామని చెప్పారు.
Also read: నాగబాబు కి టిక్కెట్ ఇవ్వనిది ఇందుకే
మనస్సాక్షి ఉన్న ఎవరైనా సరే ఆ మాటకే క్షమాపణ అడిగే పెద్దరికం లేకున్నా కూడా కనీసం సైలెంట్ అయిపోవాలి. కానీ ముద్రగడ ఇప్పుడు మరింత నీచంగా మాట్లాడ్డం మొదలుపెట్టారు. తన కూతురిని పరిచయం చేసినట్టే పవన్ తన ముగ్గురు పెళ్లాలను కూడా పరిచయం చేయాలని, పబ్ లో దొరికిన మీ అన్న కూతుర్ని, లేచిపోయిన మీ ఇంకో అన్న కూతుర్ని కూడా పరిచయం చేయమంటూ అత్యంత జుగుప్సా కరంగా మాట్లాడారు. ముద్రగడ ఇంత నీచాది నీచ స్థాయికి దిగజారి మాట్లాడతాడని ఎవరూ ఊహించారు. వైసీపీ మాట్లాడిస్తోందా, లేదా ఆయనే మాట్లాడుతున్నాడా అనేది పక్కన పెడితే ఈ తరహా స్వభావం ఖచ్చితంగా పవన్ కి వంద రేట్లు ఎక్కువ మేలు చేసేదే. ఈ దెబ్బకి కాపులు ఓట్లు పూర్తి గంప గుత్తగా పవన్ కి గుద్ది పడేయడం పక్కా అనే తెలుస్తోంది.
Click to watch Mudragada video