తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అదే పనిగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సీక్రెట్ ఒప్పందం లో ఉన్నాయి, ఆ రెండు ఒకటే అనే ప్రచారం జోరుగా చేశారు. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు పార్టీ పేరు మార్పు, అప్పటికే ఆ పార్టీ నాయకుల పై వ్యతిరేకత వెరసి కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని జనాలు నమ్మేయడానికి ఊతమిచ్చింది. కాంగ్రెస్ గెలుపు కోసం చేసిన ప్రచారాల్లో ప్రధాన పాయింట్ అదే. అందుకే ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో ఇదే ఎత్తుగడ బీఆర్ఎస్ నాయకులు వేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక మరొక సైడ్ అదే తరహా లాజిక్ ఆంధ్ర లో టీడీపీ నాయకులు పట్టుకున్నారు.
Also read: ముద్రగడ నీచత్వమే పవన్ గెలుపు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే సింగల్ పాయింట్ ని ఎజెండా గా చేసుకొని వైసీపీ ని టార్గెట్ చేస్తున్నాయి కూటమి పార్టీలు. భూమిని తీసుకున్నంత సీరియస్ గా మధ్య తరగతి కుటుంబాలు దేన్నీ తీసుకోరు. కాబట్టి ఆ భూమినే ప్రభుత్వం లాగేసుకుంటుంది అని ప్రచారం చేస్తే అందులో ఎంత నిజమో పక్కనపెడితే అది సామాన్య ప్రజల్ని భయ భ్రాంతుల్ని చేయడం తప్పదు. ఆ క్రమంలో ఎందుకొచ్చిన రిస్క్ అనుకుంటూ ఎవరైనా సరే వైసీపీ కి దూరంగా ఉండే అవకాశమే ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ నే కూటమి పార్టీలు మాటిమాటికీ నొక్కి నొక్కి చెబుతుండడం గమనార్హం.