నేరుగా ప్రచారం లేదా, వీడియో మాత్రమేనా?

chiranjeevi-for-pawan-kalyan-tg2ap

తమ్ముడు పవన్ కళ్యాణ్ ను గెలిపించండి అంటూ ఇప్పుడే చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో వీడియో బైట్ పోస్ట్ చేశారు. నిజానికి చిరంజీవి నేరుగా ప్రజల్లోకి వచ్చి పవన్ కోసం, జనసేన కోసం వారం రోజుల పాటు ప్రచారం చేస్తారు అనే వార్తలు బయటికొచ్చాయి. 30 ఇయర్స్ పృథ్వి లాంటి జనసేన నాయకుడే నేరుగా దాన్ని కంఫర్మ్ చేసేసరికి మెగా అభిమానుల్లో ఉత్సాహం నిండుకుంది.

కానీ ఇప్పుడు ఉన్నపాటిగా అవేవి లేకుండా కేవలం ఒక వీడియో బైట్ విడుదల చేయడం ఒకింత షాక్ కి గురి చేసింది. పిఠాపురం లో ఇప్పటికే పవన్ గెలుపు ఖాయమైపోయినట్టే అనే వేవ్ కనబడుతున్నా కూడా చిరంజీవి అరంగేట్రం ఖచ్చితంగా పార్టీ శ్రేణుల్లో గాని, పిఠాపురం ప్రజల్లో నూతనోత్సాహం నిండుకుంటుది అని అనేది వాస్తవం.

Also read: After Varun, now Vaishnav Tej for Janasena, but why?

ఐదు కోట్ల విరాళం, వీడియో బైట్ కన్నా నేరుగా అన్నే తమ్ముడికి ప్రచారం చేస్తే పిఠాపురం బ్యాలెట్ బాక్స్ బద్దలవడం ఖాయం. మెగా కుటుంబంలోని యువ హీరోలు, జబర్దస్త్ ఆర్టిస్టులు, సీరియల్ ఆర్టిస్టులు లాంటి పవన్ కి దరిదాపుల్లో కూడా లేని ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు చేసే ప్రచారం వల్ల పవన్ కి గాని, జనసేన కి గాని వచ్చే ఉపయోగం చాలా తక్కువ. కాబట్టి అన్నయ్యే ఇది అలోచించి ముందడుగు వేస్తే మటుకు ఈ ఆఖరి వారం జనసేన కి అంతకుమించిన ఊపు ఉండదు. ఏమంటారు?

Chiranjeevi video asking to support Pawan Kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *