పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం మూలాన చాలా మంది విశ్లేషకులుకు పని దొరికినట్లయింది. ఆయన్ని పొగుడుతూ ఫాలోవర్లను, ఫెమ్ ను తెచ్చుకోవడం, ఆ ఫేమ్ ను చూసి ఎక్కడ అది పవన్ కు ప్లస్ అవుతుందేమో అని ప్రత్యర్థి పార్టీలు ఆ విశ్లేషకులను చేరదీయడం సాధారణమే. ముఖ్యంగా మహాసేన రాజేష్ అనే వ్యక్తికి ఆ గుర్తింపు వచ్చిందే అదే పనిగా పవన్ ను పొగడడం వల్లే. జనసేన పేరు చూసే మహాసేన అంటూ ఛానల్ పేరు కూడా పెట్టుకున్నాడంటే ఆయన ఒకప్పుడు పవన్ వైపు ఏ స్థాయిలో నిలబడ్డాడో అర్ధం చేసుకోవచ్చు.
అటువంటి మనిషిని మొదట్లో టీడీపీ చేరదీయడం వల్ల కొంతకాలం చంద్రబాబు ని ఆకాశానికి ఎత్తాడు. అందరిలాగా పొగడాలి కాబట్టి పొగడాలి అన్నట్టు కాకుండా ప్రతి పొగడ్త వెనక ఒక లాజిక్ తో కూడిన విశ్లేషణ చేయగల సమర్ధుడు రాజేష్. కాబట్టే ఆయనకి ఎంత పెద్ద పెద్ద మొత్తాల్లో ఇచ్చి ఐనా సరే రాజకీయ పార్టీలు చేరదీయడానికి సిద్ధంగా ఉంటాయి. మొన్నటికి మొన్న టీడీపీ నుండి రాజేష్ కి ఎమ్మెల్యే టిక్కెట్ కూడా దక్కింది. కానీ ఆయన మాట్లాడిన పాత విడియోలను వైరల్ చేస్తూ విపరీతమైన ట్రోలింగ్ కి గురి చేసింది వైసీపీ. కాబట్టి రాజేష్ స్వయంగా టికెట్ వద్దంటూ తప్పుకున్నాడు. ఇప్పుడు ఉన్న పళంగా వైసీపీ వైపు నిలబడుతూ జగన్ ను పొగుడుతూ, పవన్ ని దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టాడు.
Also read: Guts matter: Nani open support to Pawan Kalyan
వైసీపీ కి టీడీపీ ప్రధాన ప్రత్యర్థి అయుండొచ్చు గాని, జగన్ కి మటుకు చంద్రబాబు కంటే కూడా పవన్ కళ్యానే ఆజన్మ శత్రువు. 2014లో వైసీపీ కి అధికారం దక్కకుండా చేసినందుకు పవన్ పైన జగన్ కి ఎప్పటికి కోపం తగ్గదు. కాబట్టే పవన్ ని 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో నెగ్గకూడదనే పోటీ చేసిన రెండు చోట్లా ఓడించడానికి కోట్లు కుమ్మరించాడు. ఇప్పుడు అవే కోట్లల్లోంచి కొంత ఈ మహాసేన రాజేష్ కి కూడా ఇచ్చినట్టు సమాచారం.
అందుకే ఇప్పుడు అదే పనిగా చంద్రబాబు ని కూడా పక్కనపెట్టి, పవన్ ని మాత్రమే రాజేష్ తో జగన్ తిట్టిస్తున్నాడు. “పవన్ వల్ల టీడీపీ కి చాలా వరకు మైనస్సే. పవన్ ని అసెంబ్లీ లోకి రప్పిస్తే మరింత నష్టం చేకూరుతుంది. ఒక్క వంగ గీత ని ఎదుర్కోవడానికి ఇంత మంది జబర్దస్త్ ఆర్టిస్టులు, రికార్డింగ్ డాన్స్ ట్రూపులు, సినిమా హీరోలు ప్రచారం చేయాలా” అంటూ మహాసేన రాజేష్ ప్రశ్నిస్తున్నాడు. వర్మ లేకుండా పవన్ గెలుపు కూడా అసాధ్యం అంటూ చెబుతున్నాడు. ఈగో లకు పోయి సొంతంగా ఐనా సరే నేను గెలిచి తీరతా అని లేనిపోని డాంబికాలకు పవన్ లోనవుతాడని జగన్ స్కెచ్. ఈ స్కెచ్ ని ఇప్పటికే ముద్రగడ, జోగయ్య లాంటి ఎందరి చేతో వాడేలా చేసిన జగన్, అదే స్క్రిప్ట్ మహాసేన రాజేష్ కి కూడా ఇస్తే కనుక్కోలేనంత పిచ్చోడు పవన్ అయితే కాడు.
Mahesh Sena Rajesh video about Pawan Kalyan
కాబట్టే ఎవరు ఎంత రెచ్చగొట్టినా కూడా వర్మ ని ఆకాశానికి ఎత్తుతూ, తోటి హీరోలను పొగుడ్తూ , ఇలా ప్రతి చోట తనని తాను తగ్గించుకుంటూ ముందుకెళ్తున్నాడు పవన్. ఈ ఈగోలకంటే అసెంబ్లీ లో అడుగుపెట్టి ప్రజాసేవ చేయడం ముఖ్యం అనుకుంటున్నాడు. పవన్ ని ఓడించడానికి 2019 ఎన్నికల్లో ఎన్నో ఎత్తుగడలు వేసిన జగన్ ను ఎదురుకోవాలంటే, వర్మ లాంటి లోకల్ మాస్ లీడర్ అవసరం ఖచ్చితంగా ఉందనే పవన్ గ్రహించి ఆయనతో కలిసి నడుస్తున్నాడు. జగన్ ని దించాలంటే టీడీపీ తో కలిస్తేనే కరెక్ట్ అని భావించి కూటమి ఏర్పాటు చేశాడు. ఇలా అడుగుగడుగునా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుని మానసలుకుంటున్న పవన్, రేపు అసెంబ్లీలో అడుగుపెట్టి మరిన్ని రాజకీయ చతురతలు చూపిస్తూ ప్రత్యర్థుల్ని మెంటల్ ఎక్కించేస్తాడు అని అనడంలో సందేహం లేదు.