తెలుగు రాష్ట్రాలు విడిపోయాక, ఆంధ్ర కి రాజధాని అవసరం ఏర్పడింది. చంద్రబాబు హయాంలో అమరావతి ని రాజధాని గా నిర్ణయించారు. కానీ అభివృద్హి పనులు చేపట్టే లోపే చంద్రబాబు గద్దె దిగాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు రాజధాని క్రెడిట్ చంద్రబాబు కి ఇవ్వడం ఇష్టం లేక అమరావతి నుండి మూడు రాజధానుల ప్రకటన చేశాడు.
పోనీ ఆ చేసిన ప్రకటనకు కట్టుబడి తన హయాంలో అభివృద్ధి పనులు చేపట్టి ఉంటే తరతరాలు కూడా వైఎస్ కుటుంబాన్ని జనాలు గుర్తుపెట్టుకుని వారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో జగన్ కి ప్రచారం చేసుకోవడానికి కూడా ఉపయోగపడేది. కానీ అలాంటి పనులేమీ చేయకుండా కాసేపు మూడు రాజధానులని, కాసేపు విజయవాడ రాజధాని అని, ట్విన్ సిటీస్ చేస్తామని ఇలా పూటకో మాట మాట్లాడుతూ ఐదేళ్లు పబ్బం గడుపుకోవడమే సరిపోయింది. ఇప్పుడు వేవ్ మొత్తం కూటమి వైపే ఉందని, వైసీపీ గద్దె దిగబోతోందని కూడా స్పష్టంగా తెలుస్తోంది.
ఇప్పుడు అధికారం చేపట్టాక చంద్రబాబు మళ్లీ అమరావతి రాజధాని అంటూ అభివృద్ధి పనులు వేగవంతం చేసి కంపెనీలు తేవడం, ఉద్యోగాలు కల్పించడం లాంటివి చేస్తే 2029 ఎన్నికల్లో టీడీపీ కి ఓట్లు అడగడానికి స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది. అదే విధంగా ఒకవేళ జగన్ 2029 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా కూడా రాజధానిని మార్చే అవకాశం కూడా ఉండదు.
Also read: తెలంగాణ లో కలిసొచ్చిందని ఆంధ్ర లో
ఆ విధంగా రాజధాని నిర్మాణం లాంటి ఒక మెగా ప్రాజెక్టును పక్కన పెట్టి, జనాల్లో సుస్థిరంగా నిలిచిపోయే అవకాశాన్ని జగన్ కోల్పోయినట్టే. హైదరాబాద్ లో హైటెక్ సిటీ ని రూపొందించి, ఐటీ ని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే అని ఇప్పటికీ జనాలు, అంతెందుకు బహిరంగంగానే కెటీఆర్ లాంటి నేతలు కూడా ఒప్పుకున్నారు. అదే విధంగా అమరావతి అభివృద్ధి గురించి కూడా ఆంధ్ర భవిష్యత్తు మొత్తం చంద్రబాబు ని స్మరిస్తూనే ఉంటుంది.