ఎన్నికలు ఆంధ్రాలోనా, లేదా పిఠాపురం లోనా అన్నట్టు సాగాయి ఏపీ లోని సార్వత్రిక ఎన్నికలు. ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అనేకంటే కూడా పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, ఎంత మెజారిటీతో గెలుస్తాడు, పిఠాపురంలో ఓటింగ్ సరిగ్గా జరుగుతుందా, ఈవీఎం బాక్సులు లాకర్ రూమ్ కి తీస్కెళ్ళేటప్పుడు అలా జరిగింది, ఇలా జరిగింది అంటూ జనాలకు, టీవీ ఛానెళ్లకు పొద్దస్తమానం అదే టాపిక్ అయి కూర్చుంది నిన్న.
ఆ ఉత్సుకతతోనే ఇప్పుడు పిఠాపురంలో పోల్ అయినా ఓట్ల శాతం కూడా కనుక్కునేలా చేసింది. 2019లో ఈ నియోజకవర్గంలో 81.3% ఓట్లు నమోదైతే, ఇప్పుడు ఏకంగా 86.87% ఓట్లు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంతలా బూతులకు ఓటర్లు తరలిరావడానికి పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్ కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కౌంటింగ్ రోజు పవన్ గెలుపు ఖాయమైనట్టుగానే అనిపిస్తుంది, కాకపోతే మెజారిటీ ఎంత వస్తుంది అనే దానిమీదే జనసైనికుల ఆసక్తి నెలకొంది.
పులివెందులలో జగన్ కి, కుప్పం లో చంద్రబాబు కి వచ్చే మెజారిటీ కంటే కూడా పిఠాపురంలో పవన్ కి వచ్చే మెజారిటీ ఎక్కువగా ఉంటుంది అంటూ కూడా అంచనాలు మొదలయ్యాయి. అదే జరిగితే మటుకు పవన్ ఆనందానికి అవధులు ఉండవ్. గాయపడిన సింహం నుండి వచ్చిన గర్జన భారీ ఎలివేషన్లు పవన్ కి దొరికే అవకాశమే ఉంది.
Also read: బన్నీ కి ఇది మరో “చెప్పను బ్రదర్” అవబోతోందా?
వంగ గీత తో పాటు మిగతా వైసీపీ నాయకులు తిరిగి అధికారంలోకి వస్తున్నాం అంటూ పైకి డాంబికం ప్రదర్శిస్తున్నా కూడా లోలోపల మటుకు ఓటమి భయం కనబడుతూనే ఉంది. వేవ్ మొత్తం కూటమికి అనుకూలంగా ఉన్నట్టు సామాన్యులకు సైతం అర్ధమైపోతున్నప్పుడు, ప్రత్యర్థులకు ఇంకెక్కువ క్లారిటీ ఉండే అవకాశమే ఉంది కదా.