వైసీపీ ని ఎదుర్కోవడానికి జనసేన బలం సరిపోదు. జనసేన లో పవన్ లాంటి చరిష్మా ఉన్న నాయకులు లేరు. కానీ జగన్ రౌడీయిజాన్ని, అక్రమ పాలనని ఆపాలని, గద్దె దించాలని బలమైన కోరిక. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడం మూలాన, ఆ సత్తా ఉన్న టీడీపీ తో పొత్తు కుదుర్చుకొని, బీజేపీ ని కూడా కలుపుకుంటూ కూటమి ఏర్పడడానికి ముఖ్య కారకుడయ్యాడు పవన్ కళ్యాణ్.
పవన్ లాంటి సూపర్ స్టార్ కి 21 స్థానాలేంటి అని ప్రత్యర్ధులు రెచ్చగొడుతున్నా, అభిమానులు నీరసపడిపోతున్నా కూడా, పనిచేసే వ్యూహం ఇదే అని తన బలాన్ని సరిగ్గా అంచనా వేసుకొని, ఇంత ప్రాక్టికల్ గా ముందుకెళ్లే నాయకులు ఎవరుంటారు? అంత ప్రాక్టికల్ గా ప్లాన్ చేసుకొన్నాడు కాబట్టే, ఈరోజున జనసేన నుండి పోటీ చేసిన అసెంబ్లీ స్థానాల్లో, లోక్ సభ స్థానాల్లో పూర్తి విజయాన్ని కైవసం చేసుకొని భారత దేశంలోనే 100% స్ట్రైక్ రేట్ సాధించగలిగిన ఏకైక పార్టీగా జనసేన నిలవగలిగింది.
నిజానికి 2014లో కూడా పవన్ తన మద్దతుని టీడీపీ కి, బీజేపీ కి ఇచ్చినా, అప్పుడు వైసీపీ తో కేవలం స్వల్ప తేడాతో మాత్రమే టీడీపీ గెలవగలిగింది. జగన్ బలమేంటని అప్పుడు రాజకీయవర్గాలకి తెలిసింది. ఆ తరువాత 2019 ఎన్నికల్లో భారీ విజయం కైవసం చేసుకున్న వైసీపీ ఒక ఫ్యూడలిస్టు వ్యవస్థను, హిట్లర్ పరిపాలనను తలపిస్తున్న సంకేతాలను ప్రజలకు అందించింది. వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసిన జగన్ ని ఎంత తొందరగా గద్దె దించితే అంత మంచిదని నమ్మి, ఇప్పుడు ఎన్నికల్లో చరిత్ర ఎన్నడూ చూడని ఘోర పరాజయాన్ని కట్టబెట్టారు.
Also read: పిఠాపురం శాసిస్తున్న ఏపీ ఎన్నికలు
కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని ఘోరమైన పరిస్థితుల్లో వైసీపీ పడిపోవడం చూస్తూ, కూటమి ఆ తప్పుల్ని సవరిస్తూ ప్రతి ఎన్నికల్లో కూటమిగా ముందుకెళ్తే మటుకు జగన్ ఇక పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకోవడం తప్ప మరో దారి లేదు. ఏదేమైనా ఆ మొత్తం రాజకీయ పరిమాణాలకి మూల కారకుడు, గేమ్ ఛేంజర్ మటుకు పవన్ కళ్యాణ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రాక్టికల్ గా అంచనాలు వేస్తూ ముందుకెళ్తే, ఒకప్పుడు రెండు చోట్లా నిలబడి ఓడిపోయినోడు కూడా, టైం వస్తే తాను అఖండ మెజారిటీ తో గెలవడమే కాకుండా, తన పార్టీలోని ప్రతి ఒక్కరినీ గెలిపించుకునే దిశగా అడుగులు వేయగలడు. జనసేనాని వేసిన ఈ ప్రాక్టికల్ వ్యూహం రాజకీయ చరిత్రలో లిఖించదగ్గ అధ్యాయం అని డౌట్ లేకుండా చెప్పొచ్చు.