రామోజీ రావు గారు ఎంత గొప్ప వ్యక్తి అనేది అందరూ చెప్పేదే. కాకపోతే ఆయన కన్ను మూసిన విధానం, సమయం కూడా అంతే గొప్పది. వైసీపీ ప్రభుత్వం రామోజీ రావు గారిని పెట్టిన బాధ వర్ణనాతీతం. బెడ్ పైన శ్వాస తో ఇబ్బంది పడుతూ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నా కూడా జగన్ ఆయన్ని పెట్టిన ఇబ్బందులు ప్రతి తెలుగు గుండెని కదిలించాయి.
Also read: 2024 ఎన్నికలు: కర్త, కర్మ, క్రియ పవన్ కళ్యాణ్
కక్షపూరిత చర్యలెన్నో వైసీపీ ప్రభుత్వంలో రామోజీ రావు అనుభవించక తప్పలేదు. ఒకే ఒక ఆత్మ సంతృప్తి ఏంటంటే ఆయన మరణించే చివరి రోజుల్లో వైసీపీ పాతాళంలోకి పడిపోవడం చూడగలిగారు. గెలుపు తోనే సాగిన ఆయన మీడియా ప్రయాణం, ఒడిదుడుకులను తట్టుకుంటూ ఆఖరికి గెలుపు తోనే ముగిసింది. రాజులాగా బతికారు, రాజు లాగే పోయారు.