ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు మొదలయ్యాయి. సాధారణంగా ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ని ఎక్కడో చివర్లో కూర్చోబెట్టి, ప్రమాణ స్వీకారం కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పిలిచినప్పుడు మాత్రమే రావాల్సిన అవసరం ఉంది. కానీ జగన్ కారుని అసెంబ్లీ లోనికి రావడానికి వైసీపీ నాయకులు అనుమతి కోరగా మారు సంకోచించకుండా చంద్రబాబు ఓకే చేశారు. ప్రమాణ స్వీకారం కూడా వరుసలో కాకుండా, టీడీపీ మంత్రుల తర్వాతే వెంటనే చేయించి మాజీ ముఖ్యమంత్రి గౌరవం పోకుండా కాపాడారు.
Also read: కొడాలి, జగన్- అదే నీచమైన తీరు
2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తలో ప్రజా వేదికని టీడీపీ కార్యక్రమాలకు వాడుకోవడానికి చంద్రబాబు అనుమతి కోరగా, జగన్ నిరాకరిస్తూ వెంటనే ప్రజావేదికను కూల్చివేసిన విషయం తెలిసిందే. పోనీ ఆ స్థలాన్ని దేనికైనా ఉపయోగించారా అంటే అదీ లేదు. చంద్రబాబు ని బాధపెడుతూ ఐదేళ్ల పాటు ఆ శిధిలాలు అలాగే ఉంచి తన శాడిజం చాటుకున్నాడు జగన్. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కూడా ఆ శిధిలాలు తీయకుండా జగన్ మార్క్ పరిపాలనను చరిత్ర అలాగే గుర్తుపెట్టుకోవాలని పెద్దాయన నిర్ణయం తీసుకోవడం వైసీపీ కి చెంపపెట్టు లాంటిది.