ఏదేమైనా తగ్గేదేలే అంటున్న స్వాతి రెడ్డి

tg2ap-swathi-reddy

ట్విట్టర్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకి స్వాతి రెడ్డి ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి పొలిటికల్ పార్టీకి అభిమానులు, కార్యకర్తలు అని చెప్పుకుంటూ, వాళ్ళ అభిమానాన్ని, ప్రత్యర్థి పార్టీలపై సెటైర్లని పోస్ట్ చేస్తూ పాపులర్ అయినవాళ్లు ఎందరో. ఆ కోవలో అనిత రెడ్డి లాంటివాళ్లు వైస్సార్సీపీ అభిమానులైతే, స్వాతి రెడ్డి టీడీపీకి వీరాభిమాని. ఏకంగా నారా లోకేష్ కూడా తన ట్విట్టర్ ఖాతా నుండి స్వాతి ని ఫాలో అవుతున్నారంటే ఈవిడ టీడీపీ పై చాటుకునే అభిమానం ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇలా వేళల్లో ఫాలోయర్స్ ఉంటూ, రెగ్యులర్ గా పోస్టులు పెట్టే మిగతా అభిమానులు నేరుగా ప్రొఫైల్ ఫోటోలు పెట్టుకునే ధైర్యం చేయలేకపోయినా కూడా, స్వాతి రెడ్డి మటుకు ఎవరికీ జంకకుండా, ఫోటోలు మాత్రమే కాకుండా, ఏకంగా అప్పుడప్పుడు డైరెక్ట్ వీడియోలు కూడా పెడుతుంటది. కాబట్టి, మిగతావారి కంటే, స్వాతి పోస్టులకి ఉండే ఎంగేజ్మెంట్ ఎక్కువ.

ఆ పోస్టుల వల్ల టీడీపీ అభిమానులు, కార్యకర్తలనుండి అభినందనలు ఎలా ఉంటాయో, ప్రత్యర్థి పార్టీల అభిమానుల నుండి, నేతలనుండి ఎప్పటికప్పుడు తిట్లు, ట్రోల్స్ కూడా అదే అదే రేంజులో ఉంటాయి. ఈ ట్రోల్స్ ఏ రేంజ్ కి వెళ్లాయంటే, నారా లోకేష్ తో స్వాతి రెడ్డి కి అక్రమ సంబంధాలు అంటగట్టేదాక. కానీ అవేవి స్వాతిని జంకనివ్వకుండా, టీడీపీ పై తన అభిమానాన్ని చాటనివ్వకుండా ఆపలేకపోయాయి.

ఇక, ఇటీవల జగన్ పై జరిగిన రాయి దాడి గురించి, స్వాతి రెడ్డి తనదైన శైలిలో పోస్ట్ చేసిన సెటైరికల్ వీడియో, ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అది మీరూ చూసేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *