తవ్వేసిన గోతిని మళ్ళీ మళ్ళీ తవ్వుతూ ఇంకా ఇంకా లోతుకు పడిపోతున్నడు జగన్. ఆ మధ్య మూడు పెళ్లిళ్ల ప్రస్తావన మాటిమాటికి తీసుకొస్తున్న జగన్ పై పవన్ వీరలెవెల్లో విరుచుకుపడ్డారు. విధాన పరమైన చర్చలు చేయకుండా వ్యక్తిగత విమర్శలు చేయడమేంటి. అయినా నాలుగో పెళ్లి ఎప్పుడయింది, ఆ నాలుగో పెళ్ళాం జగనేనా అంటూ చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపి కొద్దికాలం కాలం జగన్ ఆ వ్యక్తిగత కామెంట్లకు దూరమయ్యేలా చేశాయి.
కానీ ఇప్పుడు ఆ వేడి చల్లారిందని అనుకున్నాడో ఏంటో, కుక్క తోక లాగ మళ్ళీ పెళ్లిళ్ల గురించి కామెంట్లు చేస్తూ తన ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నాడు జగన్. పవన్ కళ్యాణ్ ని పేరు పెట్టి పిలిచే ధైర్యం చేయలేని ఈయన, పవన్ అడిగే విధానమైన పరమైన ప్రశ్నలకు సమాధానం లేకనే ఇలా వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఒక పిరికిపందలా మిగిలిపోతున్నాడని జనాలు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన ప్రత్యర్థి ఐన చంద్రబాబు పై కూడా ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడని జగన్, ఒక్క పవన్ పై మటుకు ఇలా మాట్లాడడమే తెలుపుతుంది, పవన్ విషయంలో ఉన్న జంకు, జగ్గు కి ఇప్పట్లో తీరేది కాదు అని, పవన్ ప్రభావం పక్కాగా తెలిసే ఇలా చేస్తున్నాడని.