పెద్ద ఫామిలీల నుండి వచ్చే హీరోల తాకిడి తట్టుకొని నిలబడాలంటే కొత్త హీరోలు ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు సరికొత్తగా ఆవిష్కరించుకోవాలి. ఇది వాళ్ళు మాత్రమే చేయగలరు అనిపించేలా ఉండాలి ఆ కొత్తదనం. అప్పుడైతేనే ఆడియన్స్ కన్ను ఆ హీరోలపై పడుతుంది.
ఇటీవల డీజే టిల్లు అటువంటి స్టంట్ చేసి సక్సెస్ అయ్యాడు. నిజానికి సిద్ధూ జొన్నలగడ్డ అంతకుముందే కొన్ని సినిమాలు చేసినా కూడా, అందులో తన ప్రత్యేకత ఏమి లేకుండా, ఎవరైనా చేయగలిగే సినిమాలేగా అన్నట్టుగా ఉండేవి. కాబట్టి ఆ సినిమాల వల్ల సిద్ధూ కి ఒరిగిందేమి లేదు. కాబట్టి తన స్టైల్ మార్చి రింగుల జుట్టు విగ్గు పెట్టి, తనే కథ రాసుకొని తీసిన టిల్లు సీరీస్ బంపర్ హిట్ అయింది. ప్రొమోషన్లకి కూడా సిద్ధూ అదే విగ్ తో తిరగడం వల్ల సినిమాకే కాకుండా, టిల్లు అనబడే ఆ క్యారెక్టర్ కి కూడా ఫుల్ ప్రమోషన్ అయి, ఆడియన్స్ కి హీరో క్యారెక్టర్ బాగా రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇదే అవకాశం ఉన్న హీరో నవదీప్ తప్పటడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఫేడ్ అవుట్ అయిపోయిన నవదీప్, చాలా ఆశలతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ కొత్త హెయిర్ స్టైల్ తో, సరికొత్త కథ, కథనంతో తీస్తున్న సినిమా లవ్ మౌళి. సినిమా విడుదలకి ముస్తాబవుతున్న ఈ సమయంలో ప్రొమోషన్లకి నవదీప్ సినిమాలో వాడిన విగ్గులో కాకుండా నార్మల్ గా తాను ఉండే క్లీన్ షేవ్ తోనే దర్శనమిస్తున్నాడు. ఇలా చేయడం వలన విగ్గు తో తిరిగి సిద్ధూ చేసుకున్న టిల్లు క్యారెక్టర్ ప్రమోషన్ అడ్వాంటేజ్, నవదీప్ మిస్ అయిపోతున్నట్టే. తనని తాను ఒక రీలాంచ్ లాగ చేసుకుంటున్న ఈ సినిమా విషయంలో ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ప్రమోషన్ చేసుకుంటే నవదీప్ మళ్ళీ ఫామ్ లోకి రావడం పెద్ద సమస్యేమీ కాదు.