కొత్తగా చేస్తేనే జనాల దృష్టిలో పడతాం, మందిలో ఒకడిగా ఉంటే ఎవరు పట్టించుకోరు. ఇదే లాజిక్ ని అబ్రదీప్ సాహా కూడా పట్టుకొని “యాంగ్రి రాంట్ మ్యాన్” అనే ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాడు. రివ్యూస్ అందరిలా కాకుండా విపరీతమైన ఆవేశంగా, గట్టిగా చెప్పడం తన ఐడెంటిటీగా మార్చుకొని తక్కువ కాలంలోనే బాగా ఫేమస్ అయ్యాడు.
అయితే ఇప్పుడు ఈ ఐడెంటిటీనే తన ప్రాణాలు తీసింది. శరీరంలోని వివిధ చోట్ల అవయవాలు బాగా దెబ్బ తిని, నిన్న రాత్రే సుదీర్ఘ మృత్యు పోరాటం తర్వాత ప్రాణాలు విడిచాడు. కేవలం 5 లక్షలకు దగ్గరగా సబ్స్ క్రైబర్లను పొంది, ఈలోపే కన్నుమూయడం వలన అతని కుటుంబ సభ్యులనే కాకుండా, ఫాలోవర్లను కూడా తీవ్ర కలవరపెడుతుంది.