ఎండ తీవ్రత మూలాన తెలంగాణ లో బస్సు లో బంద్ చేయనున్నట్లు అధికారులు నిర్ణయించారు. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మధ్యాహ్నం పూట జనాలు ఎక్కువగా బయటికి రావడం మానేశారు.
ఖాళీ బస్సులు నడుపుతూ వృధా ప్రయాస ఎందుకని టీఎస్ఆర్టీసి కూడా ఆ సమయంలో అంటే మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య బస్సులు బంద్ చేయనున్నట్లు, ౪ గంటల తర్వాతే కొనసాగించనున్నట్లు తెలుస్తుంది. ఈ మూలంగా ఉచిత బస్సు సర్వీసులకు ఎదురుచూసే మహిళలకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎండా తీవ్రత తగ్గి బస్సులు తిరిగి మొదలుపెట్టేదాకా ఎదురుచూడడం తప్ప వేరే దారైతే లేదు