ఈరోజుల్లో పాపులర్ అవడం పెద్ద పనేం కాదు. పాపులారిటీ ఉన్నోడిని నాలుగు తిట్టొ, పొగిడో, రెచ్చగొట్టొ సులువుగా అవొచ్చు. ఎన్నికల వేళ కాబట్టి, ఈ పంధాలో పాపులర్ ఐన ఒక ట్విట్టర్ పేజీ “Actual India”. పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ ఆయన అభిమానులతోనే వేలల్లో ఫాలోయర్స్ తెచ్చుకుంది ఈ పేజీ.
అదే పనిగా ప్రత్యర్థుల్ని పొగుడుతున్న ఏ పేజినైనా రాజకీయ పార్టీలు తమవైపు తిప్పుకోవడం సాధారణం. అలాగే ఈ పేజీని కూడా అధికార పార్టీ వైసీపీ పూర్తిగా తమ వైపు తిప్పుకుంది. వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు ఐనా కూడా, జగన్ కి పవన్ ఓటమే అన్నిటికన్నా కీలకం. దానికోసం 2019 ఎన్నికలలో శతవిధాలుగా భీమవరం, గాజువాక ఓటర్లను ప్రలోభ పెట్టి పవన్ ని ఓడించగలిగాడు. ఎందుకంటే పవన్ అసెంబ్లీ లో అడుగుపెడితే అడుగడుగునా జగన్ ని, ఆయన పాలసీలను ఎండగట్టడం ఖాయమని ఆయనకీ తెలుసు.
Also read: Harihara Veeramallu teaser: Krish exit, a mega danger awaits?
దానికి తోడు 2014 ఎన్నికల్లో జగన్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం పవన్ అని కూడా తెల్సు కాబట్టి, జగన్ కి పవన్ ఆజన్మ శత్రువే. కాబట్టే ఈ పేజీ లో కూడా ప్రధానంగా పవన్ పైనే ట్వీట్ల బాణాలు ఎక్కుపెడుతూ ఉంటాడు. ఎలాగో పేజీలో పవన్ ఫాలోవర్లే కాబట్టి, వారి తిట్లతో, పేజీ కి రీచ్ కూడా బాగానే ఉంటుంది. కాబట్టి పేజీకి, దాన్ని బ్యాక్ డోర్ లో నడుపుతున్న జగన్ కి ఢోకా లేదు.