ఒక సైడ్ పవన్ కళ్యాణ్ “హలో ఏపీ, బై బై వైసీపీ” అనే నినాదం విపరీతమైన వైరల్ గా మారి, జనసైనికులను ఉర్రూతలూగిస్తుంది. మరో సైడ్ అదే కుటుంబం నుండి అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్ధికి ప్రచారం చేస్తుంటే దిగ్బ్రాంతికి కూడా లోను చేస్తుంది.
మిగతా మెగా హీరోలలాగే అల్లు అర్జున్ కూడా పవన్ కి తన మద్దతు ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. అయితే ఇప్పుడు ఏకంగా వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవి రెడ్డి కోసం ఫీల్డ్ లోకి దిగి ప్రచారమే చేస్తున్నాడు. తన స్నేహితుడి కోసం కూడా ఒక ట్వీట్ తో సరిపెట్టుంటే పోయేది, కానీ ఈ ప్రచారం మటుకు జనసైనికులకు ఇప్పుడు అస్సలు మింగుడు పడడం లేదు.
VIDEO: Allu Arjun in Nandyal
“చెప్పను బ్రదర్” అంటూ అప్పట్లో సింగల్ డైలాగ్ తో పవన్ అభిమానులకు శత్రువు అయిపోయిన బన్నీ, ఆ తర్వాత ఫ్యాన్స్ లో ఆ వేడి తగ్గించడానికి చాలా టైం పట్టింది. ఇప్పటికీ రామ్ చరణ్ ని దగ్గరికి తీసినంతగా పవన్ అభిమానులు అల్లు అర్జున్ ని దగ్గరకి తీయలేని పరిస్థితి. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఎంత స్నేహితుడి కోసం వెళ్ళాడులే అని సరిపెట్టుకుందాం అని అనుకున్నా కూడా ఈ పాత హీట్ వల్ల అదీ సాధ్యం అవట్లేదు. కనీసం కుర్ర మెగా హీరోలు ప్రచారానికి వచ్చిన అదే టైంలోనే బన్నీ కూడా ఫార్మాలిటీ కి జనసేన కి ప్రచారం చేసి, ఈరోజు వైసీపీ అభ్యర్థి కి ప్రచారం చేసినా కొద్దిలో కొద్దివరకు సర్దుమణిగేదేమో. కానీ ఇప్పుడు చేయిదాటి పోయినట్టే కనిపిస్తుంది.
Also read: Chiranjeevi’s ‘NO’ to disturb PK fans
ఇక ఇదే సమయంలో పిఠాపురం లో రామ్ చరణ్ ప్రచారం చేస్తుండడం, అభిమానులను దువ్వడానికా అన్నట్టు అల్లు అరవింద్ కూడా చెల్లి సురేఖ, చరణ్ తో ఉన్నారు. ఆఖరి రోజు చరణ్ చేసే ప్రచారం తో జనసైనికుల్లో మరింత ధృడంగా అబ్బాయి పైన అభిమానం పెరిగే అవకాశం ఉంది.