అధికారం చేజిక్కించుకున్న ఐదు సంవత్సరాలు జనం లోకి రావాలంటే పరదాలు, గుడికెళ్లమంటే ఇంట్లోనే సెట్లు వేస్తూ మేనేజ్ చేసిన జగన్, ఎన్నికల ప్రచార సమయంలో మటుకు వేరే దారి లేక జనంలోకి వస్తున్నారు. కాబట్టి అయ్యగారి ఫ్యానిజం ఏంటో తేటతెల్లమవుతుంది.
మొన్నటికి మొన్న రాయలసీమలో ప్రచార రథం పై ఉండగానే చెప్పు గాల్లో ఎగురుకుంటూ మీదకి రావడం, కోనసీమలోనేమో గులక రాయి తగిల్తే సింపతీ మింగడం, ఇప్పుడు కొత్తగా మరోసారి ప్రచార సమయంలో గుడ్డు వచ్చి మీద పడడం. జనాల్లో జగన్ పై ఎంత వ్యక్తిరేకత ఉంది అనేది ఇలాంటి సంఘటనలు జరిగితేనే క్లారిటీ వస్తుంది. కాబట్టే తన గురించి తనకి బాగా తెలుసు కాబట్టే, పరదాలని నమ్ముకుంటూ అలా పాక్కుంటూ పాక్కుంటూనే ఐదేళ్లు గడిపేశాడు చోర శిఖామణుడు.