అర్ధం పర్దం లేకుండా ప్రతిదానికి టీజర్, ట్రైలర్ అంటూ రిలీజ్ చేసుకుంటూ పోతే సినిమాలన్నీ సర్దుకోవాల్సిందే. Harihara Veeramallu సినిమా ఎన్నో సంవత్సరాలుగా షూటింగ్ దశలోనే ఉంది. ఇదిగో అంటూ, అదుగో అంటూ ఎప్పటికప్పుడు షూటింగ్ వాయిదా పడుతూనే ఉంది. ఒక దశలో సినిమా ఆగిపోయిందని, డైరెక్టర్ కూడా మారిపోయాడని వార్తలు కూడా వచ్చాయి. ఇటీవల విడుదలైన పోస్టర్లలో డైరెక్టర్ పేరు కూడా లేకపోవడంతో అవే వార్తలు నిజమని కూడా నమ్మక తప్పడం లేదు.
Also read: Confirmed: Chiranjeevi to campaign for Janasena
ఇక ఇలా అరకొర షూటింగ్ జరుపుకున్న పవన్ సినిమాలకి సంబంధించిన టీజర్లు ట్రైలర్లని కేవలం రాజకీయ లబ్ది కోసమే వాడుకుంటున్నట్టుగా ఉంది. మొన్నటికి మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ కూడా ఇలాగే గాజు గ్లాస్ సింబల్ ని ఉద్దేశిస్తూ డైలాగులు చెప్పడం సాధారణ జనాలకి పక్కన పెడితే, అభిమానులకే రోత పుట్టించాయి. వకీల్ సాబ్ రీరిలీజ్ కూడా పొలిటికల్ డైలాగుల కోసమే చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు హరిహర వీరమల్లు టీజర్ ధర్మం కోసం యుద్ధం అనే ట్యాగ్ తో విడుదలవబోతోంది. జగన్ ని ఉద్దేశిస్తూ సంబంధం లేని ఒక చరిత్రకారుడి సినిమాలో కూడా డైలాగులు ఇరికిస్తే మటుకు, పాన్ ఇండియన్ సినిమాల జోరుతో ఇప్పటికే హీరోలందరు పవన్ ను దాటేసి ముందుకు వెళ్తుంటే, పవన్ ఇలా లోకల్ సినిమాలను కూడా రోత పుట్టిస్తూ పూర్తిగా సర్దుకోవడం ఖాయం.