హీరోలనుండి మాస్ ని జూస్ పిండినట్టు పిండగలిగే సామర్ధ్యం ఉన్న హరీష్ శంకర్ ఇప్పుడు ఏకంగా మెగా స్టార్ నుండే ఆ జూస్ పిండగలిగే అవకాశం లభించింది. పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ హీరో పొలిటికల్ కమిట్మెంట్ల వల్ల వాయిదా పడుతుండడం వల్ల, ఈలోపు రవితేజ తో మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ తో ఒక సినిమా చేసి ఫైనల్ స్టేజి కి తీసుకొచ్చాడు.
మరొక సైడ్ చిరంజీవి కి బీవీఎస్ రవి అందించిన ఒక స్టోరీ లైన్ వినిపించగా బాస్ దానికి ప్రొసీడ్ అని కూడా అనడంతో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు హరీష్. అన్ని కుదిరితే ఎన్నికలయ్యాక అటు తమ్ముడ్ని, ఇటు అన్నని ఒకేసారి డైరెక్ట్ చేసే అరుదైన అవకాశం హరీష్ సొంతమవుతుంది.