ఇళయరాజా, లెజెండ్ అనే పదానికి నిలువుటద్దం. సంగీత ప్రపంచానికి ఆయన అందించిన సేవలు ఎన్ని తరాలు మారినా మరచిపోలేనివి. ప్రొఫెషన్ పరంగా ఆయనకి పేరు పెట్టడానికి ఏమీ లేదు, కానీ వ్యక్తి పరంగా ఎప్పటికప్పుడు తన దిగజారుడుతనం చూపించుకుంటూనే ఉన్నాడు. దశాబ్దాల కాలం తన సంగీతంలో ఎన్నో వందల పాటలు పాడిన బాలు కి కూడా లీగల్ నోటీసు పంపించారాయన.
నిజానికి ఇళయరాజా సంగీతం ఒక ఎత్తైతే, ఆ పాటలకు బాలు గాత్రం మరో ఎత్తు. బాలు గాత్రం లేకుండా, రాజా పాటలకు అంత కీర్తి ప్రతిష్టలు దక్కేవా అంటే అనుమానమే. పైగా ఎన్నో సంవత్సరాల స్నేహం వారిది. అది కూడా మరచి బాలు పై కేసు వేసిన శాడిజం ఆయనది. ఇప్పుడు మంజుమ్మెల్ బాయ్స్ సినిమాలో తన పాట ఒకటి వాడుకున్నారంటూ సినిమా టీమ్ పై కేసు వేశారు.
Also read: అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి, హేమ బ్లూ ఫిలిం చూశారా ?
సినిమాకి ఒక పాట చేసినప్పుడు, దానికి పారితోషకం అందుకోవడంతోనే నిజానికి సంగీత దర్శకుడు ఆ పాట హక్కులు అమ్మేసినట్టు. అలా కాకుండా జీవిత కాలం మొత్తం ఆ పాట హక్కులు తనవే అంటూ కోర్టులో కేసు వేసినా కూడా, తీర్పు కూడా తనకి అనుకూలంగా రావడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. అందుకే ఇలా ఎప్పటికప్పుడు కేసులు వేసుకుంటూ తన చాదస్తాన్ని ప్రదర్శించుకుంటూ మాటిమాటికి జనాలతో తిట్టించుకుంటున్నారు ఆయన.