మొన్నటి వరకు వల్లభనేని వంశి లాంటి వైసీపీ నాయకులే అనుకుంటే, ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కూడా అదే పాట పాడుతున్నారు. ఇండియా టుడే ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేసాయ్ తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎంతమందికని ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుంది, పెద్ద పెద్ద కంపెనీలు ఎంతమందికని ఎంప్లాయిమెంట్ కల్పిస్తాయి. కాబట్టి వాటివల్ల ఉపయోగం ఉండదు, నిరుద్యోగ సమస్య తీరదు. చదువుకున్నవాళ్ళు పక్క రాష్ట్రాలకి వెళ్లి ఉద్యోగం చేసుకోవాలి అంటూ సాక్ష్యాత్హు ఒక రాష్ట్ర ముఖ్య మంత్రే అంటుంటే అంతకుమించి సిగ్గు చేటు మరొకటి ఉంటుందా.
మరొక సైడ్ ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల్లో ఇటు హైదరాబాద్ ని, అటు ఆంధ్ర ని కంపెనీలు తెచ్చి రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపిన చంద్రబాబు మాత్రమే ఇప్పుడు ప్రజలకు దిక్కు అన్నట్టుగా ఉంది పరిస్థితి.
Also read: Land Titling Act, another boon to oppositions
అభివృద్ధి, ఉద్యోగ కల్పన, కంపెనీలు తేవడం వంటి వాటి గురించి ఒక సీఎం ఇలా మాట్లాడితే, రాష్ట్ర ప్రజలకి ఇంకేం అభయం ఉంటుంది, ఏ ధైర్యంతో రాష్ట్రం లో ఉంటారు. ఎవరైనా వలస వెళ్లిపోకుండా ఎలా ఉంటారు. పక్క రాష్ట్రాల్లోకి వెళ్లి ఉద్యోగం చేసుకోమని సీఎం చెప్తుంటే, ఆ సీఎం ని కూడా పక్క రాష్ట్రాల్లోకి వెళ్లి పోటీ చేయక, ఆంధ్ర లో ఉండి, అధికారం ఉండి గడ్డి పీకడం తప్ప, చేసేది ఇంకేముంటది చెప్పండి. వైసీపీ ని, జగన్ రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసే స్టేట్మెంట్ ఇది. ఏమంటారు?