అదే పనిగా నాయకుల స్మరణ చేస్తూ ఉంటే, ఒకసారి కాకపోతే మరోసారి ఆ నాయకుడికి సంబంధించిన రాజకీయ పార్టీ అక్కున చేర్చుకోవడం చూస్తూనే ఉంటాం. కానీ ఒక్క జనసేన విషయంలో మటుకు ఈ రూల్ రోకలి కింద నలిగిపోయింది. దశాబ్దానికి పైగా నిత్యం పవన్ నామ స్మరణ చేశారు కళ్యాణ్ దిలీప్ సుంకర. జనసేన పై వచ్చే ప్రతి విమర్శని కళ్యాణ్ తిప్పి కొడుతుంటే ఈయనే పార్టీ తరపున స్పోక్స్ పర్సన్ ఏమో అనే ఒక బ్రాంతిలో కూడా కొన్ని రోజులు జనాలను ఉంచగలిగారు. కానీ అటు 2019లో గాని, 2024లో గాని కేడీఎస్ కి జనసేన సీటు కేటాయించలేకపోయింది. దీనితో మనోడు ప్లేట్ తిప్పేసి పవన్ పై, పార్టీ పై ఇప్పుడు దుమ్మెత్తి పోస్తున్నాడు.
Also read: మరోసారి ట్రోల్ మెటీరియల్ అయిన మార్గాని భరత్
ఇప్పుడు కొత్తగా రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య తరపున లాయర్ గా కేసు వాదించడానికి దిగాడు. ఈ క్రమంలో మోతాదుకు మించిన వ్యాఖ్యలే దిలీప్ అడుగడుగునా చేస్తున్నాడు. ఇటీవల టీవీ ఇంటర్వ్యూలో భాగంగా రాజ్ తరుణ్ స్నేహితుడు శేఖర్ భాషా ని ల* కొడకా అని తిట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీనితో అటు సామాన్య జనమే కాకుండా, పవన్ అభిమానులు కూడా ఇలాంటి వాడు కాబట్టే ఈయనకి పవన్ జనసేన టికెట్ ఇవ్వలేదంటూ కొనియాడుతున్నారు.