తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తన మద్దతు జగన్ కి ఇచ్చారు, ఆయన విజయమే కాంక్షించారు. ఇంత వరకు బాగానే ఉంది, కానీ తనకొచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారంగా జగనే ఈసారి భారీ మెజారిటీ తో గెలవబోతున్నట్లుగా కెసిఆర్ జోస్యం చెప్పారు. పక్క రాష్ట్రం గురించి రిపోర్ట్ అందించిన కెసిఆర్ కి సొంత రాష్ట్రంలో తన ఓటమిని చెప్పే రిపోర్ట్ ఎందుకు రాలేకపోయింది అని ఇప్పుడు సోషల్ మీడియా లో కెసిఆర్ పై విపరీతమైన ట్రోల్స్ అవుతున్నాయి.
ఎన్నో సంవత్సరాల నుండి చంద్రబాబు – కెసిఆర్ మధ్య తీవ్రమైన కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. పలు సార్లు చంద్రబాబు పై కెసిఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థి ఐన జగన్ కి తన మద్దతు ఇస్తూ ఆయన విజయాన్నే కెసిఆర్ కోరుకుంటున్నారు. వైసీపీ ఎన్నికల కాంపెయిన్లలో రోడ్ల మీద పార్టీ జెండాలు పట్టుకొని ఒకరిద్దరు అభిమానులు దండాలు పెట్టడం లాంటి స్టంట్లు కూడా తెరాస తెలంగాణ లో అప్లై చేసిన ఫార్ములానే. రేవంత్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పుడు జగన్ కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకపోవడం, కెసిఆర్ అస్వస్థత కి గురైనప్పుడు మటుకు పలకరించడం వంటి ఎన్నో సీన్లు ఇద్దరి మధ్య చీకటి స్నేహాన్ని తలపిస్తూనే ఉన్నాయి.