తమిళ్ సై సౌందరరాజన్, తెలంగాణ మాజీ గవర్నర్. బీజేపీ నుండి పోటీకి దిగే ఉద్దేశంతో ఇటీవలే తమిళ్ సై గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. అయితే గవర్నర్ గా ఉన్నంత కాలం తమిళ్ సై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలు వ్యతిరేకిస్తు, కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. దీనితో బీఆర్ఎస్ నేతల నుండి ఆవిడ ఎన్నో విమర్శలు కూడా ఎదురుకున్నారు.
ఈ బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతే ఇప్పుడు తమ రాజకీయ లబ్ది కోసం ఉపయోగపడే ఆయుధం లా కనిపించింది బీజేపీ కి. రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రచారంలో స్టార్ క్యాంపైనర్ గా తమిళ్ సై ని పరిశీలిస్తున్నారు. నిజానికి ఆవిడకి బీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. కానీ జనాల్లో ఆవిడపై ప్రత్యేకమైన క్రేజ్ ఏమీ లేదు. కాబట్టి తమిళ్ సై ప్రచారం చేస్తే, జనాలు వచ్చి బీజేపీ కి ఓట్లేసే అవకాశాలు తక్కువ. కాబట్టి స్టార్ క్యాంపైనర్ గా తమిళ్ సై పనికొచ్చే అవకాశాలు తక్కువనే చెప్పాలి.