అనిల్ కుమార్ యాదవ్, బోరుగడ్డ అనిల్, అంబటి రాంబాబు లాంటి ఉన్మాది తరహా వ్యక్తిత్వాలు కలిగిన ఎందరో వైసీపీ నాయకుల వల్లే ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నేలమట్టం చేసేశారు ప్రజలు. ఆ పార్టీలో ఎంతోకొంత పాజిటివిటీ కలిగి, ఇతర పార్టీల అభిమానులకు కూడా నచ్చేలా మసలుకున్న లీడర్ ఎవరైనా ఉన్నారా అంటే అది ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. గుడ్ మార్నింగ్ పేరుతో ప్రతి రోజు ఆయన నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని ఎంచుకొని ఇంటింటికి తిరుగుతూ సమస్యలు అడిగి మరీ వాటిని అక్కడికక్కడే పరిష్కరించే దిశగా అడుగులు వేసిన కేతిరెడ్డి అంటే ప్రత్యర్థి పార్టీల అభిమానులకి కూడా ఇష్టమే.
అలాంటి కేతి రెడ్డి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవడం వైసీపీ కే కాదు, అందరికీ ఆశ్చర్యం కలిగించింది. సోషల్ మీడియా లో దీని గురించి చర్చలు కూడా జరిగాయి. నిజానికి ఈ ప్రజా తిరస్కరణ కేతిరెడ్డి కి కాదు, వైసీపీ పార్టీకి లభించింది. కాబట్టే 175/175 అంటూ విర్రవీగిన జగన్ కి, 11 మాత్రమే కట్టబెట్టి అదః పాతాళానికి తొక్కేశారు జనం. కేతి రెడ్డి కూడా తన ఓటమిని ఇలాగే విశ్లేషించి ఉంటే బాగుండేది. కానీ అలా కాకుండా తాను వీధి వీధికి వెళ్లి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం వల్ల చులకన అయ్యానని, అలా కాకుండా జనాలనే తిప్పుకొని ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం అంటూ కాలయాపన చేసుంటే బాగుండేదని చెప్పారు.
Also read: అసెంబ్లీ లో జగన్ గౌరవం తగ్గకుండా చంద్రబాబు చర్యలు
ప్రజతీర్పుని గౌరవించడం మానేసి ప్రజల్నే ఇలా అవహేళన చేస్తూ కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎవ్వరికీ మింగుడు పడడం లేదు. ఇదే ఉద్దేశంతో కేతిరెడ్డి ఉంటే తదుపరి ఎన్నికల్లో ఐనా సరే గెలవడం కష్టమే. ఎందుకంటే ఇదే క్లిప్పింగ్ ప్రతిపక్షం ప్రతి ఎన్నికల సమయంలో వైరల్ చేస్తే, మమ్మల్ని తిప్పించుకొని ఇదిగో, అదిగో అనేవాడు మాకెందుకు అంటూ ప్రజలు అనుకుంటే, కేతిరెడ్డి ఇక రాజకీయ సన్యాసం తీసుకోవడమే ఖాయంగా కనిపిస్తోంది.