కొడాలి, జగన్- అదే నీచమైన తీరు

kodali-nani-jagan-tg2ap

కొడాలి నాని, బోరుగడ్డ అనిల్, రోజా, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ ఇలా ఒకరా ఇద్దరా, చెప్పుకుంటూ పోతే వైసీపీ మొత్తం ఇలాంటి బూతురాయుళ్లదే. 151 ఎమ్మెల్యేల అఖండమైన మెజారిటీతో అధికారం ఇచ్చిన ప్రజలే, మరుసటి ఎన్నికలకి కనీసం ప్రతిపక్ష హోదాని ని ఇవ్వకుండా ఇలాంటి బూతు రాయుళ్లందరినీ అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వకుండా చేయగలిగారు. ఆతంవిమర్శ చేసుకొని ఇప్పటికైనా వీళ్ళలో మార్పు వస్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది.

అలా కాకుండా ఇలాగే చెలరేగిపోతే మటుకు శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి రావడం ఖాయం. ఇంతకుముందు లాగా 50-60 శాతం ఓట్లతో అధికారం దక్కించుకునే రోజులు పోయాయి. ప్రజలకు నచ్చకుంటే ఎలాంటి చీత్కారానికి గురవుతారని ఇటీవలే జరిగిన ఎన్నికలే నిదర్శనం. కాబట్టి అత్యంత అప్రమత్తంగా నాయకులు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది వదిలేసి ఇప్పటికే భూతుల రాయుడుగా పేరుపొందిన కొడాలి నాని అదే పంథా కొనసాగిస్తున్నాడు.

Also read: Ayyanna Pathrudu response in losing ministry shows NDA commitment

ఫర్నీచర్ దొంగతనం విషయంలో గాని, రిషికొండ భవనాల విషయంలో గాని కొడాలి మాట్లాడిన మాటలు చూస్తుంటే ఎవరికైనా అసహ్య వేయక మానదు. కొడాలి మాత్రమే కాకుండా ఆ పార్టీ నాయకుడు జగన్ కూడా అసెంబ్లీ స్పీకర్ ని, అందులోనూ వయసులో పెద్దవారిని ఉద్దేశిస్తూ వాడు వీడు అంటూ సంబోధించిన విధానం చూస్తుంటే నీచమైన చర్య గా కనిపిస్తుంది.

ప్రజలే నడ్డి విరిచి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా, తీరు మార్చుకోకుంటే, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వైసీపీ అతఃపాతాళానికి పడిపోవడం తప్ప, రాజకీయంగా ప్రజల్లోకి వచ్చే ఏమీ చేసే అవకాశం ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *