కాపులకు ప్రతినిధి గా వ్యవహరిస్తున్న ముద్రగడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే, ఎదో మూల అది జనసేనాని కి కీడు చేస్తుందేమో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు సాక్ష్యాత్తు ఆయన కూతురు శ్రీమతి క్రాంతి గారు తండ్రిని వ్యతిరేకిస్తూ ఒక వీడియో బైట్ విడుదల చేశారు.
పవన్ ని ఓడించి తీరతా, ఓడించకుంటే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటా అని ఇటీవల ముద్రగడ శపథం చేసిన సంగతి విదితమే. ఈ విషయం గురించి క్రాంతి మాట్లాడుతూ, అది తనకు షాక్ కు గురిచేసిందని, వైసీపీ తన తండ్రిని కేవలం పవన్ ని తిట్టించడానికి మాత్రమే వాడుకుంటుందని, పవన్ గెలుపుకు ఇక పై తాను కూడా పోరాడతానని వెల్లడించారు. ఎన్నికల ముందు అటు వైసీపీ కి, ఇటు ముద్రగడ కి ఇది దారుణమైన అవమానమనే చెప్పాలి.
Also read: రౌడీలతో సిబిఐ ని జగన్ బెదిరించాడు- షర్మిల
పవన్ ఇంటికొచ్చి పిలిస్తేనే వస్తానని పట్టు చూపకుండా, జనసేనాని కి సపోర్ట్ గా ముద్రగడే ముందుకెళ్ళుంటే ఈరోజు కాపుల్లో ఆయనకు బాగా పలుకుబడి పెరిగేది. ఆ విధంగా అటు పవన్ కంటే, ఇటు ముద్రగడకే పవన్ సాన్నిహిత్యం కలిసొచ్చేది. అలా కాకుండా మొండికేసి ఇగో కి పోయి వైసీపీ లో కలిసే సరికి, పాతిన మహేష్ లాంటి ఎందరినో కేవలం పవన్ ని తిట్టించడానికే వాడుకున్నట్లు ముద్రగడ ని కూడా జగన్ అలాగే వాడుకునే సరికి ఇటు వైసీపీ లో పూర్తి స్థాయి లీడర్ కాలేక, అటు జనసేన లో గేట్లు మూతపడేలా చేసుకొని ఎటు కాకుండా రాజకీయ జీవితాన్ని అతలాకుతలం చేసుకున్నారు ముద్రగడ.