పేరుకి పవన్ కి సొంత అన్న అయినా కూడా నాగబాబు ఎప్పుడూ జనసేన లో అంత చొరవ తీసుకోలేదు. అనుభవ లేమి దృష్యా పవన్ కూడా అన్నకి ప్రత్యేకమైన స్థానం ఏమీ కల్పించలేకపోయాడు. పార్టీ లో నెంబర్ 2 స్థానంలో గట్టిగా వినపడాల్సిన నాగబాబు పేరు ప్లేస్ లో నాదెండ్ల మనోహర్ వచ్చి చేరాడు. ఈ ఎన్నికల్లో కూడా నాదెండ్ల కి టిక్కెట్ దొరికినా కూడా నాగబాబు కి దక్కలేదు. మనిషితో ఉండే రేలషన్ కంటే అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు పవన్, దానికి ఖచ్చితంగా ఆయన్ను అభినందించాల్సిందే.
ఇక పోటీ ఎలాగో చేయట్లే కాబట్టి, ఈ గ్యాప్ ని నాగబాబు కరెక్టుగా వినియోగించుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ప్రచారాల్లో, జనసేన పార్టీ అంతర్గత మీటింగుల్లో, పార్టీ ఇతర వ్యవహారాల్లో ఆయన యాక్టివ్ అయ్యారు. నాదెండ్ల తన నియోజకవర్గంలో ప్రచారంతో బిజీగా ఉన్నారు కాబట్టి, నాగబాబు కి ఈ వ్యవధి కీలకంగా మారిపోయింది. ఇదే తరహాలో నాగబాబు పార్టీ కి సంబంధించి అన్ని వ్యవహారాల్లో కలగజేసుకుంటూ ముందుకెళ్తుంటే, నెంబర్ 2 స్థానంలో ఆయన్ను రానున్న రోజుల్లో చూడడం ఖాయం. 2029 ఎన్నికల్లో సీటు దక్కించుకొని పోటీ లో నిలబడడం కూడా అంతే ఖాయం.
Also read: After Varun, now Vaishnav Tej for Janasena, but why?
ఇక నాగబాబు సతీమణి పద్మజ గారు కూడా జనసేన ప్రచారంలో బాగా బిజీ అయిపోయారు. కుటుంబంలోని హీరోలు ఒకట్రెండు రోజులు వచ్చి వెళ్ళిపోయినా కూడా వదిన మటుకు మరిది కోసం అదే పనిగా ప్రచారాల్లో ఎండనకా, వాననకా పాల్గొంటుండడం మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు.