ఎన్నికల అఫిడవిట్ ల మూలంగా నాయకుల ఆస్తుల వివరాలు బయటికి రావడంతో జనాల అంచనాలు తారుమారవుతున్నాయి. తాజాగా కార్ల విషయానికొస్తే, చంద్రబాబు కి ఒక్క అంబాసిడర్ కార్, జగన్ కి ఒక్క కార్ కూడా లేకపోవడం, పవన్ కి మటుకు ఏకంగా తొమ్మిది కార్లు, ఒక బైక్, ఒక ట్రక్ కూడా ఉన్నట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు.
నిజానికి ఈ ముగ్గురిలో వేలకోట్లు ఆస్తులు ఉన్నట్టు జగన్, చంద్రబాబు అఫిడవిట్ లో పేర్కొంటే, పవన్ మటుకు ఆస్తులు కాదు కదా, 64 కోట్ల అప్పులే ఉన్నట్లు పేర్కొన్నారు. అక్రమాస్తులు లేక, నిఖార్సైన సొంత డబ్బు తోనే పదేళ్లకు పైగా ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఒక రాజకీయ పార్టీని నడపడం ఆషామాషీ విషయం కాదు. మనిషి స్టేటస్ కి ఉన్న కార్లకి సంబంధం లేదని కూడా పవన్ తన క్లీన్ పాలిటిక్స్ తో నిరూపిస్తున్నాడు