“అమర్నాథ్ ను కాల్చి పడేసినప్పుడు, 30 వేల మంది ఆడబిడ్డలు కనిపించకుండా పోయినప్పుడు, సుగాలి ప్రీతిని నాశనం చేసినప్పుడు రాష్ట్రానికి అవని గాయం, జగన్ కి చిన్న గులక రాయి తగిల్తే అయిందా” – తెనాలి లో పవన్ కళ్యాణ్.
జగన్ రాయి దాడి ద్వారా రాబట్టలనుకున్న రాజకీయ మైలేజ్ ని పడుకోబెట్టడానికి ఇంతకుమించిన గాలి తీసే విధానం ఉంటుందా. సరైన సమయంలో అర్ధవంతంగా పవన్ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. నిజమే కదా, ఈ మాత్రం దానికి జగన్ ఇంతలా చేయాలా అంటూ ప్రతి ఒక్కరి చేత అనిపిస్తున్నాయి.
ఇక వాలంటరీ వ్యవస్థ మీద కూడా పవన్ మాట్లాడుతూ, 5000 జీతానికి యువతని కట్టిపడేయకుండా, వాళ్లకి తగిన స్కిల్ డెవలప్మెంట్ చేసి, దానికి అనుగుణంగా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తాం. అసెంబ్లీ లో తిట్టుకోవడం మాత్రమే తెల్సిన మనకి, ప్రజా సమస్యల మీద చర్చిస్తూ పరిష్కార దిశగా సాగుతాం అంటూ ఇలా అడుగడుగునా ఎంతో అర్ధవంతంగా, పెద్దరికంగా పవన్ చేసిన ఈ కామెంట్లు జనాల్లోకి బాగా వెళ్తున్నాయి, రాజకీయంగా పవన్ పరిణితిని చాటుతున్నాయి.