2019 ఎన్నికల్లో సోలో గా వెళ్లి సో సో గా కూడా మిగలలేక పడిపోయాడు. ఈసారి మటుకు అడుగులు పక్కాగా వేస్తూ పిఠాపురాన్ని ఎంచుకొని ఎలాగైనా అసెంబ్లీ లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. వాతావరణం చూస్తుంటే పవన్ గెలుపు అనివార్యం అన్నట్టే ఉంది. కానీ ఆ గెలుపు యొక్క క్రెడిట్ వర్మ అకౌంట్ లోకే వెళ్లేట్టుగా క్లియర్ గా తెలుస్తుంది.
పిఠాపురం నుండి పవన్ పోటీ చేయనున్నాడని అనౌన్స్ చేయగానే, వర్మ తన అనుచరులతో పవన్ పై తీవ్రమైన కామెంట్లు చేయించారు. తర్వాత చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చి సముదాయించడం వల్ల తన ట్రాక్ మార్చి పవన్ గెలుపు కొరకు ప్రచారం చేస్తున్నాడు. పవన్ గెలవడం వెనక పూర్తిగా తన హస్తం మాత్రమే ఉందని, క్రెడిట్ మొత్తం తనకు మాత్రమే దక్కాలని వర్మ తన ట్విట్టర్ లో పూర్తిగా అదే తరహాలో పోస్టులు పెడుతూ, పవన్ పై ఒక రకమైన కోల్డ్ వార్ నడిపిస్తున్నాడు. మరొక సైడ్ పవన్ కూడా తన గెలుపును వర్మ కి అంకితం చేయడానికి ఏ మాత్రం ఆలోచించట్లేదు.
ఈ రకమైన కాంప్రమైస్ యాటిట్యూడ్ పవన్ అభిమానులకు మింగుడు పడడం లేదు. తమ అధినేత కి అంతటి స్టార్ బలం ఉన్నా కూడా, పోయిన సారి ఓడిపోయిన ఒక మాజీ ఎమ్మెల్యే ముందు ఇలా చేతులు కట్టుకొని నిలబడి ఒంగి ఒంగి సలాములు కొట్టడం అవసరమా అంటూ వాపోతున్నారు. ఏదైతేనేం, పోయినసారి గెలవలేక పవన్ అభిమానులను నిరుత్సాహ పరిస్తే, ఈసారి గెలిచినా కూడా అభిమానులకు పెద్దగా ఉత్సాహం కలిగే అవకాశం లేకుండా చేసినట్టుగా అయిపొయింది.