లోక్ సభ ఎన్నికలు రేవంత్ రెడ్డి, కెసిఆర్ మధ్య మారోసారి యాసిడ్ టెస్ట్ పెట్టబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మారిపోయాక ఇరువురి మధ్య విబేధాలు తార స్థాయికి చెరుకున్నాయి. కవిత అరెస్ట్, కేటిఆర్ కాల్ ట్యాపింగ్ కేసు అంటూ రకరకాలుగా కెసిఆర్ కుటుంబంతో చెడుగుడు ఆడుకుంటుండు రేవంత్. దీనివల్ల బీఆర్ఎస్ నేతలకి కూడా భయం మొదలై మెల్లమెల్లగా పార్టీని వీడుతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పనైపోయెదనుకుంటున్న ఈ తరుణంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఒక 6-8 సీట్లు పార్టీ గెలిస్తేనే విలువ ఉంటుంది, లేదంటే ఉద్యమ పార్టీ ఇక తుడిచిపెట్టుకుపోవాల్సిందే.
మరొక సైడ్ నాలుగు నెలల కాంగ్రెస్ పాలన ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు ఊదరగొడుతూనే ఉన్నారు. కాబట్టి, పార్టీ పై ప్రజానాడి ఎలా ఉందని తెలుసుకోవడానికి కూడా ఈ రానున్న ఎన్నికలు ముఖ్యం. కాబట్టి అటు కెసిఆర్, ఇటు రేవంత్ రెడ్డి ఈ లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.