Super హిట్ సినిమాలకు సీక్వెల్ పేరుతో పొడుగింపులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. కానీ Hollywood తరహాలో సినిమాటిక్ యూనివర్స్ సౌత్ లో ఈ మధ్యే మొదలైంది. లోకి వర్స్ పేరుతో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ ఫీట్ విజయవంతంగా చేయగలిగారు. కార్తీ హీరో గా నటించిన ఖైదీ సినిమాకి కమల్ హాసన్ విక్రమ్ సినిమాకి లింక్ పెట్టి స్క్రీన్ ప్లే నడిపిన విధానం ఆడియన్స్ కి మెంటలెక్కించింది.
ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ని కూడా అలాంటి ఐడియాతో వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా అని అడిగితే ప్రస్తుతానికి అలాంటి కథ మనసులో అయితే లేదు భవిష్యత్తులో వస్తే ఖచ్చితంగా చేస్తా అన్నాడు. జనాలు ఎంజాయ్ చేస్తున్నారు కదా అని స్కోప్ లేకున్నా కూడా ఎదో ఒక లింక్ పెట్టేసి సినిమాటిక్ యూనివర్స్ చేసేస్తే అది అతుకుల బొంత లాగే అనిపించడం ఖాయం. సందీప్ కి ఆ భయం ఉంది కాబట్టే క్రేజ్ ని బట్టి కాకుండా ఐడియా వస్తేనే చేద్దామనుకోవడం హర్షణీయం.