అవినాష్ రెడ్డి ని, జగన్ ని ఏ యాంగిల్లో కూడా వదిలిపెట్టకుండా వివేకా కేసు తో ఫుట్ బాల్ ఆడిస్తుంది సునీత రెడ్డి. అసలే కూటమి ఏర్పడి అధికార పార్టీ కి చమటలు పుట్టిస్తుంటే, ఆ చమటలకి మసాలా పూసి మరీ హోలీ ఆడిస్తుంది సునీత. ఎన్నికల వేళ అటు ప్రచారం పై దృష్టి పెట్టాలా, లేదా ఇటు సునీత పై దృష్టి పెట్టాలో తెలియక సతమతమవుతుంది వైస్సార్సీపీ.
సాక్షి కాకుండా అన్ని ప్రధాన టీవీ చానెళ్లలో లైవ్ టెలికాస్ట్ చేసి మరీ, వివేకా మర్డర్ చుట్టూ ఉన్న మనుషుల ఫోన్స్ స్క్రీన్ షాట్లు, గూగుల్ మ్యాప్స్ వివరాలు, వాట్సాప్ చాట్లు, ఇలా ఏవి వదలకుండా, జాతరలో బూరలు ఊదినట్టు, స్లయిడ్ షో వేసి మరీ చూపించింది. ఆ వివరాలన్నీ చూసిన ఎవరికైనా ఇంత క్లియర్ గా అవినాష్ రెడ్డి హస్తం ఉందని తెలిశాక, ఇంకా అతను ఎలా తప్పించుకొని తిరుగుతున్నాడు అని విస్తుపోయేలా చేయడం ఖాయం.
ఇప్పటికే కడపలో అవినాష్ ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయకుండా షర్మిల ప్రచారం చేస్తుంది, దానికి భయపడి ఇప్పటికే అవినాష్ పోటీ చేసే స్థానం మార్చుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఈలోపు ఇంత వివరంగా సునీత రెడ్డి వివరించేసరికి, స్థానం మార్చుకోవడం కాదు, అసలు పోటీ నుండి తప్పుకొని, బతుకు జీవుడా అంటూ దేశం వదిలి పారిపోవడమే అవినాష్ కి దిక్కులా కనిపిస్తుంది. చూద్దాం, ఇది ఎటు తెలుతుందో.