జాతకాలా, జాంకాయలా అన్నట్టు అయిపొయింది వేణు స్వామి పరిస్థితి. సినీ, రాజకీయ వర్గాల జాతకాలు చూస్తూ పాపులర్ అయిపోయిన ఈయన, అక్కడితో ఆగకుండా పాపులారిటీ ఇంకా పెంచుకోవాలనే అత్యాశతో ప్రిడిక్షన్లు మొదలుపెట్టాడు. ప్రభాస్ కి బాహుబలి తర్వాత ఇక హిట్లు పడవని, దుకాణం సర్ధేయాలని, మొన్నటి ఆంధ్ర ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని, ఇలా అడుగడుగునా నోటికొచ్చింది చెబుతూ దారుణమైన పరాజయాలు, అవమానాలు ఎదురుకుంటూనే ఉన్నారు. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు కొత్తగా నిశ్చితార్ధం చేసుకున్న నాగ చైతన్య, శోభిత లు 2027 లో ఒక అమ్మాయి వల్ల విడిపోతారని వాగేశారు. ఇక అంతే, సోషల్ మీడియా మొత్తం దుమారం రేగింది.
సినిమా, రాజకీయ పరమైన ప్రిడిక్షన్లు తప్పైతే ట్రోల్ చేసి ఆపేస్తారేమో గాని, కొత్త జీవితం ప్రారంభిద్దామని నిశ్చితార్ధం చేసుకున్న జంటని విడిపోతారని చెబితే మటుకు ఎవరు ఊరుకుంటారు. సోషల్ మీడియా తో పాటు ఏకంగా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా ఇందులో జోక్యం చేసుకొని వేణు స్వామి కి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నెగిటివిటీ తో సంబంధం లేకుండా తన వీణ కళతో పాజిటివిటీ మాత్రమే సంపాదించుకున్న వేణు స్వామి సతీమణి వీణ శ్రీ వాణి గారు ఇప్పుడు ఈ విషయం పై స్పందించారు.
Also read: Samantha lied about divorce?
వేణు స్వామి చేసింది తప్పని ప్రపంచం మొత్తం కోడై కూస్తున్నా అది తప్పని చెప్పడం మానేసి, ఆ ప్రపంచానికి పని లేదా. రైతుల సమస్యలు, ఇతర ఎన్నో ప్రజా సమస్యలని వదిలేసి ఈ విషయం గురించి టెలికాస్ట్ చేస్తారేంటి, ఇదేనా జర్నలిజం అంటూ న్యూస్ ఛానళ్ళని దుయ్యబట్టారు. టీఆర్ఫీ రేటింగుల కోసమే పనిచేస్తున్నాయి ఛానళ్లు అంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే రేటింగుల కోసం కాకుండా సంఘ సేవ చేస్తామని ఎవరైనా కోట్లు పెట్టి చానళ్లు పెడతారా, పోనీ ఈవిడ ఉచితంగా వీణ వాయిస్తారా, సంఘ సేవ అంటూ వేణు స్వామి ఉచితంగా జాతకం చెబుతారా? వాళ్ళ ఛానళ్లకు ఏది రేటింగ్ పెంచుతుందో, ఏ కంటెంట్ ఐతే జనాలు అదే పనిగా చూస్తున్నారో అదే ప్రసారం చేయడానికి సిద్ధపడతాయి.
ఇలాంటి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా శ్రీవాణి మాట్లాడిన విధానం విస్తుపోయేలా చేసింది. భర్త పై ప్రేమ మంచిదే, కానీ ఆ ప్రేమ ఇలాంటి విషయాల్లో పబ్లిక్ లో చూపిస్తే అది ఇద్దరికీ ప్రమాదమే. వేణు స్వామే కాదు, ఇక ఈవిడ కూడా కెరీర్ పరంగా దుకాణం సర్ధేసేలా, ఉన్న పాజిటివిటీ మొత్తం పోగొట్టుకుందని తెలుస్తుంది.