వివేకా కేసు కి సంబంధించి కడప ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎవరి వైపు ఉన్నారు? షర్మిల, సునీత వైపా లేదా జగన్, అవినాష్ వైపా? ఈ ఎన్నికలే అవి తేలుస్తాయి. కడప నుండి షర్మిల, అవినాష్ ఇద్దరు ఎంపీ లుగా పోటీ చేస్తుండడంతో ప్రజా తీర్పు పూర్తిగా వివేకా కేసు ని బట్టే ఉండే అవకాశాలే ఎక్కువ. మొదటి నుండి వివేకా మర్డర్ కేసు లో అవినాష్ హస్తం ఉందన్నట్టుగా డైరెక్ట్ గా సిబిఐ తేల్చి చెప్పి అరెస్ట్ కూడా చేయబోయింది. కానీ కేవలం ముఖ్యమంత్రిగా జగన్ తన అధికారాన్ని అడ్డుపెట్టి అవినాష్ ని కాపాడుతూ వచ్చాడు.
ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయి, అవినాష్ కూడా ఎంపీ కాలేకపోతే మటుకు ఇక అవినాష్ ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. బీజేపీ కి పారిపోయి తలదాచుకుందామని చూసినా కూడా కూటమిలో భాగంగా టీడీపీ తో కూడా పొత్తులో ఉన్న బీజేపీ అంత తేలిగ్గా అవినాష్ ని బీజేపీ లోకి ఆహ్వానం పలకదు, టీడీపీ, జనసేన పలకనివ్వదు కూడా.
Also read: Jabardasth RP went mile ahead to bash out Roja
తెలంగాణ ఎన్నికల్లో షర్మిల ప్రభావం చూపలేకపోయింది. అవినాష్ కడప కి సిట్టింగ్ ఎంపీ, స్థానికంగా పవర్ ఫుల్ కూడా. వైఎస్ కుటుంబం లోని మనిషి అవడం వల్ల కూడా అవినాష్ కి ఆ పలుకుబడి వచ్చింది. కానీ వైఎస్ కుటుంబ సభ్యుడు ఒక వైపు, సాక్ష్యాత్తు వైఎస్ కూతురు షర్మిల మరో వైపు ఉంటే, ప్రజా తీర్పు కూతురుకి అనుకూలంగా ఉండే అవకాశాలే ఎక్కువ. అదే జరిగి అవినాష్ అధికారం కోల్పోతే నెల తిరక్కుండానే టీడీపీ ప్రభుత్వం అవినాష్ ని జైలుకి పంపించే కార్యక్రమం చేపట్టడం ఖాయం. అందులోనూ చంద్రబాబు ను జైలు కి పంపిన వైసీపీ ని అంత తేలిగ్గా చంద్రబాబు వదిలే అవకాశాలైతే లేవు.
కక్ష సాధింపు చర్య లా కాకపోయినా కూడా, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇన్ని రోజులు వివేకా కేసు పై ముసుగు కప్పి దాచిపెడుతున్న జగన్ ని, ఆ ముసుగు తీసేసి నిజాలు బయటికి తెలిసేలా చేసి అవినాష్ తో పాటు, జగన్ ని కూడా చంద్రబాబు ఊచలు లెక్కపెట్టేలా చేసే అవకాశం లేకపోలేదు. అందులోనూ అవినాష్ ని ఓడిస్తే జనాలు కూడా వివేకా కేసు విషయంలో జగన్ కి, అవినాష్ కి వ్యతిరేకంగానే ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి అవినాష్ కి రాజకీయ భవిష్యత్తు ఇంతటితో సమాప్తం అయిపోయినట్టే. జగన్ కి కూడా రాజకీయంగా ఇది కోలుకోలేని దెబ్బ గా మిగిలిపోయే అవకాశం ఉంది.